బ్యాంకింగ్ దిగ్గజానికి నివాళి
కర్నూలు(అగ్రికల్చర్): కెనరా బ్యాంకు వ్యవస్థాపకులు అమ్మెంబల సుబ్బారావు పాయి 173వ జయంతి కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో కెనరా బ్యాంకుకు 53 బ్రాంచీలు ఉన్నాయి. అన్ని బ్రాంచీల్లో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఖాతాదారులకు స్వీట్లు పంపిణీ చేశారు. 1852 నవంబర్ 19న జన్మించిన ఆయన 1906 జూలై 1న కెనరా బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను, సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. ప్రస్తుతం కెనరా బ్యాంకు 10 వేల శాఖలతో సేవలందిస్తోందని అధికారులు వెల్లడించారు. కర్నూలు శివారులోని కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో వ్యవస్థాపకుడి జయంతి పురస్కరించుకొని శిక్షణ పొందుతున్న వారికి జీరో ఖాతాలు ప్రారంభించి సురక్ష బీమా యోజన అమలుకు చర్యలు చేపట్టారు. అభ్యర్థులతో ర్యాలీ నిర్వహించారు.


