ఎస్‌డబ్ల్యూపీసీలను వినియోగంలోకి తేవాలి
● జెడ్పీ సీఈఓ నసరరెడ్డి
సి.బెళగల్: గ్రామాల్లో చెత్త నిర్వహణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కేంద్రాలను (ఎస్‌డబ్ల్యూపీసీ) వినియోగంలోకి తీసుకురావాలని జెడ్పీ సీఈఓ నసరరెడ్డి సూచించారు. మంగళవారం ఆయన పలుకుదొడ్డి గ్రామ పంచాయతీలో పర్యటించారు. వీధులను, మురుగు కాలనువలను, నీటి సరఫరా పథకాలను పరిశీలించి రెగ్యులర్‌గా శుభ్రం చేయించాలని పంచాయతీ కార్యదర్శి అజహర్ మహ్మద్‌ను ఆదేశించారు. అనంతరం గ్రామ శివారులోని ఎస్‌డబ్ల్యూపీసీను తనిఖీ చేసి తడి, పొడి చెత్త సేకరణ, నిర్వహణ అంశాలను పీఎస్‌ను అడిగి తెలుసుకున్నారు. వానపాము ఎరువుల తయారీ, విక్రయాలకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని అధికారులతో సమావేశమై పలు అంశాలపై సూచనలిచ్చారు. సచివాలయం – 2ను తనిఖీ చేసి ఉద్యోగుల హాజరు, రికార్డులను తనిఖీచేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా సేవలందించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. డిప్యూటీ ఎంపీడీఓ మహేశ్వరి, కార్యాలయ పరిపాలన అధికారి శ్రీనివాసు, పంచాయతీ కార్యదర్శి జగదీష్ ఉన్నారు.


