సీట్ల కోసం పాట్లు
చంద్రబాబు సర్కారు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో బస్సులన్నీ కిక్కిరిసి పోతున్నాయి. పథకం ప్రారంభించినప్పటి నుంచి బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు ఫీట్లు చేయాల్సిన దుస్థితి నెలకొంది. బస్సుల్లో పురుషులకు సీట్లు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక దివ్యాంగులు, వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ స్థితిలో శుక్రవారం మహానంది క్షేత్రానికి వచ్చిన భక్తులు బస్సుల్లో సీట్ల కోసం పరుగులు తీస్తూ కనిపించారు. కొందరు ప్రమాదకర స్థితిలో తమ పిల్లలను కిటికీల్లోంచి బస్సులోకి ఎక్కించారు. బస్సులు రద్దీగా మారడంతో ప్రయాణికులను నియంత్రించడం డ్రైవర్, కండక్టర్లకు కష్టతరంగా మారింది.
– మహానంది
పిల్లలను కిటికీలోంచి బస్సులోకి
ఎక్కిస్తున్న దృశ్యం


