ఎస్సార్‌బీసీలో విద్యార్థి గల్లంతు
పాములపాడు: మద్దూరు పంచాయతీ కృష్ణానగర్ గ్రామ సమీపంలోని ఎస్సార్‌బీసీ కాలువలో వీరేష్ అనే విద్యార్థి గల్లంతయ్యాడు. గ్రామానికి చెందిన మొగిళీశ్వరప్ప, మల్లిక దంపతుల కుమారుడు వీరేష్ (17) పాములపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంట ర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం తల్లిదండ్రులు పొలంలో మొక్కజొన్న కోత కోపిస్తున్నారు. కాగా అప్పటికే కోత కోసి ఎస్సార్‌బీసీ కాల్వ గట్టుపై మొక్కజొన్నలు ఆరబోయగా అక్కడికి వీరేష్ వెళ్లాడు. అయితే నీటి కోసం కాల్వలో దిగిన వీరేష్ కాలు జారి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. కాల్వ గట్టుపై జీవాలు మేపుతున్న ఓ యువకుడు గమనించి కేకలు వేశా డు. చుట్టు పక్కల రైతులు అక్కడికి చేరుకునేలోపే యువకుడు నీటిలో మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సురేష్ బాబు పుట్టీల సాయంతో మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపట్టారు. ఒక్కగానొక్క కొడుకు నీటిలో గల్లంతు కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఎస్సార్‌బీసీలో విద్యార్థి గల్లంతు


