ప్రాధాన్యత కేటగిరి టీచర్లకు ప్రత్యేక వైద్య శిబిరం
కర్నూలు సిటీ: ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ యాజమాన్యాల స్కూళ్లలో పని చేస్తున్న అన్ని కేటగిరిల ఉపాధ్యాయులు ప్రాధాన్యత కేటగిరి, స్పెషల్ పాయింట్లకు అర్హత కలిగిన ఉపాధ్యాయులకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు డీఈఓ ఎస్.శామ్యూల్‌పాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(ధన్వంతరి కాన్ఫరెన్స్ హాల్) మూడో అంతస్తులో వైద్యశిబిరం ఏర్పాటు చేశామన్నారు.
పర్వతారోహకుడికి
ఆర్థిక సాయం
కర్నూలు(సెంట్రల్): ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనా 7వ శిఖరం దౌళగిరి పర్వతాన్ని అధిరోహించిన గోనెగండ్లకు చెందిన సురేష్‌బాబుకు సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆర్థిక సాయం అందజేశారు. 25 ఏళ్ల సురేష్‌బాబు ఇప్పటి వరకు 25 శిఖరాలను అధిరోహించడమే గాకుండా ఏడు ఖండాల్లోని 5 ఎత్తైనా శిఖరాలను అతి తక్కువ సమయంలో అధిరోహించి రికార్డు సృష్టించారు. సురేష్‌బాబు ధైర్యసాహసాలను కలెక్టర్ మెచ్చుకుని సీఎస్‌ఆర్ కింద జియో మైసూరు కంపెనీతో మాట్లాడి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందించి అభినందించారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, పీసీబీ ఈఈ కిశోర్‌రెడ్డి, జియోమైసూరు కంపెనీ ప్రతినిధి రామ్మోహన్ పాల్గొన్నారు.


