
వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్‌లో చేరిన న్యాయవాదులు
కర్నూలు(లీగల్): వైఎస్‌ఆర్‌సీపీ లీగల్‌సెల్‌ను మరింత బలోపేతం చేయాలని కర్నూలు, అన్నమయ్య జిల్లాల జోనల్ ఇన్‌చార్జి ఎం.ప్రభాకర్, స్టేట్ లీగల్ సెల్ జాయింట్ సెక్రటరీ షాషావలి అన్నారు. ఈనెల 10వ తేదీన కర్నూలు జిల్లా వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ సమావేశం జరుగనుంది. ఈ కార్యక్రమం నిర్వహణపై సోమవారం స్థానిక జిల్లా లీగల్ సెల్ కార్యాలయంలో అధ్యక్షుడు పి.సువర్ణారెడ్డి అధ్యక్షతన సమావేశమై చర్చించారు. జోనల్ ఇన్‌చార్జ్ మాట్లాడుతూ జిల్లా లీగల్ సెల్ సభ్యులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన భూహక్కు చట్టం ద్వారా రైతులకు ఎలాంటి నష్టం ఉండదని సువర్ణారెడ్డి అన్నారు. అనంతరం బండారి ఈరన్న నాయకత్వంలో సుమారు 20 మంది న్యాయవాదులు వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్‌లో చేరారు.