ఏసీబీకి పట్టుబడిన ఎస్‌ఐ
కర్నూలు: ఓ వ్యక్తిని అరెస్టు చేయకుండా నోటీసులతో సరి పెట్టేందుకు లంచం డిమాండ్ చేసిన మహిళా పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ దండగల కిరణ్ బాబు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. బనగానపల్లె మండలం యనగండ్ల గ్రామానికి చెందిన పి.శివనాగిరెడ్డికి భారతితో 2017లో వివాహమైంది. కొంతకాలం తరువాత వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. తన భర్త అదనంగా కట్నం కోసం వేధిస్తున్నాడని గత ఏడాది నవంబర్ 24న భారతి మహి ళా పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఎస్‌ఐ కిరణ్ కుమార్ భార్యాభర్తలకు రెండు విడతలుగా కౌన్సెలింగ్ చేశారు. అయి నప్పటికీ తన భర్తలో మార్పు రావడం లేదని భారతి పోలీసులకు చెప్ప డంతో శివనాగిరెడ్డిపై వేధింపుల కేసు నమోదైంది. అయితే కేసులో లేని హత్యాయత్నం 307 సెక్షన్‌ను తొలగించేందుకు రూ. 60 వేలు ఇవ్వాల ని శివనాగిరెడ్డిని ఎస్‌ఐ కిరణ్ బాబు బెదిరించాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు సోమవారం (5వ తేదీ) కర్నూలు ఎ.క్యాంప్‌లోని ఏసీబీ కార్యాలయంలో డీఎస్పీ సోమన్నను సంప్రదించాడు. ఈ మేరకు శివనాగిరెడ్డితో ఎస్‌ఐకి ఫోన్ చేయించి వారి సంభాషణను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. రూ.30 వేలు లంచం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుని మంగళవారం మధ్యాహ్నం గుత్తి రోడ్డులోని ఎస్‌ఐ కిరణ్ బాబు ఇంటికి వెళ్లి బాధితుడు శివనాగిరెడ్డి రూ.30 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని మహిళా పీఎస్ కు తరలించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి మహిళా పీఎస్ ఎస్‌ఐగా కిరణ్ పని చేస్తున్నారు. కేసులో లేని 307 సెక్షన్ పేరిట బాధితున్ని బెదిరించి లంచం తీసుకుంటున్న ఎస్‌ఐ కిరణ్‌ను వలపన్ని పట్టుకున్నట్లు డీఎస్పీ మీడియాకు తెలిపారు. దాడుల్లో సీఐలు కృష్ణయ్య, రాజాప్రభాకర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


