ఈ మూడు సంఘటనలే కాదు... జిల్లాలో రోజుకు సగటున రోడ్డు ప్ర
కర్నూలు: ప్రమాదాలతో ఎక్కువ మంది మృతిచెందినట్లు గత ఏడాది చివరలో పోలీసు శాఖ విడుదల చేసిన నేర నివేదికలో తేలింది. మృతుల్లో యువత అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రెండేళ్లుగా పరిశీలిస్తే ఏడాది పొడవునా జరిగిన ఘటనలతో పోల్చితే డిసెంబర్, జనవరి నెలల్లో అంటే పండుగలు, కొత్త ఏడాది సమయాల్లో జరిగిన ప్రమాదాలే అధికంగా ఉంటున్నాయి. గత ఏడాది జనవరిలో 74 ప్రమాదాలు, డిసెంబర్‌లో 89 ప్రమాదాలు చోటు చేసుకోవడం వాటి తీవ్రతకు నిదర్శనంగా చెప్పవచ్చు. హెల్మెట్ ధరించకుండా ముగ్గురు, నలుగురు యువకులు ద్విచక్ర వాహనాలపై కంటికి కనిపించనంత వేగంగా వెళ్లిపోతున్నారు. స్నేక్ డ్రైవింగ్‌తో ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు.
మద్యంమత్తే కారణం
జరుగుతున్న ప్రమాదాలకు మద్యం మత్తు ప్రధాన భూమిక పోషిస్తోంది. కర్నూలులో జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు, తుంగభద్ర బ్రిడ్జికి కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు, చిన్నటేకూరు వద్ద బస్సు ప్రమాద సంఘటనకు ముందు ద్విచక్ర వాహనదారుడు మృతికి మద్యం మత్తే కారణమని పోలీసులు తేల్చారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడుపుతూ ఆదోని మండలం ఇస్వి పోలీసులకు పట్టుబడగా అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు జైలు శిక్ష విధించారు. గత రెండేళ్లుగా నమోదైన డ్రంకెన్ డ్రైవ్ కేసులే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. 2024లో 1,613 కేసులు నమోదు కాగా, 2025లో ఏకంగా 9,196 కేసులు నమోదు కావడం దాని తీవ్రతకు అద్దం పడుతోంది.
కనిపించని మార్పు
జాతీయ రహదారిపై 80 కి.మీ వేగానికి మించి వెళ్లకూడదు. కానీ వాహనదారులు 100 నుంచి 140 కి.మీ వేగం కంటే అధికంగా దూసుకెళ్తున్నారు. స్పీడ్ గన్‌ల ద్వారా భారీ వాహనాలకు తనిఖీల ద్వారా, నిఘా కెమెరాల ద్వారా ద్విచక్ర వాహనదారులకు చలానాలు విధిస్తున్నప్పటికీ మార్పు రావడం లేదు. కూడళ్ల వద్ద 40 కి.మీ వేగం కంటే అధికంగా వెళ్లొద్దు. దారి పొడవునా కూడళ్ల వద్ద అండర్ పాసులు లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
హైవేల్లో ఎక్కువ ప్రమాదాలు
జిల్లాలో ప్రధానంగా ఎన్‌హెచ్–40, ఎన్‌హెచ్–44, ఎన్‌హెచ్–167, ఎన్‌హెచ్–340సితో పాటు రాష్ట్ర రహదారులు ఉన్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఎక్కువ మంది ప్రయాణికులతో తిరుగుతుంటాయి. హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా బెంగళూరు వెళ్లే 44 నంబర్ జాతీయ రహదారిలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి. చిన్నటేకూరు వద్ద జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదం దేశంలో సంచలనంగా మారింది. జాతీయ రహదారుల పొడవునా ఏదో చోట రక్తం చిందని రోజు ఉండదంటే అతిశయోక్తి కాదు.
ప్రమాదాల కూడళ్లు
హైవేపై ఎక్కువగా కూడళ్ల వద్దే ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారిని దాటే సమయంలో పాదచారులు ద్విచక్ర వాహనదారులే ప్రాణాలు విడుస్తున్నారు. నేరుగా వెళ్లే లైట్ మోటార్, భారీ వాహనాలు కూడళ్ల వద్ద కూడా అధిక వేగంతో వెళ్తుండటమే ప్రమాదాలకు కారణం. కొన్నిసార్లు ఢీకొట్టిన వాహనాలు ఆచూకీ దొరకడం లేదు. వాటిని గుర్తించేందుకు హైవేపై సరిగా సీసీ కెమెరాలు కూడా లేవు. కర్నూలు బాలాజీ నగర్, రిజిస్ట్రార్ ఆఫీస్ ఎదురుగా, రింగ్ రోడ్డు సమీపం, వెల్దుర్తి శివారులో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి.
రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాం. చిన్నపాటి నిర్లక్ష్యం పెద్దపాటి ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంటుందని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నాం. అవగాహన కార్యక్రమాలు మాసానికే పరిమితం కాకుండా పోలీసు శాఖ కూడా ఏడాదంతా నిర్వహిస్తోంది.
– శాంతకుమారి, డీటీసీ
సంవత్సరం ప్రమాదాలు మృతులు అందులో క్షతగాత్రులు డ్రంకెన్ డ్రైవ్
యువకులు కేసులు
2024 547 300 247 653 1613
2025 666 307 209 731 9196
మొత్తం 1213 607 456 1384 10809
ఈ మూడు సంఘటనలే కాదు... జిల్లాలో రోజుకు సగటున రోడ్డు ప్ర


