ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలి

Nov 15 2026 8:35 PM | Updated on Nov 15 2026 8:35 PM

కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు

పెనమలూరు: తాడిగడప, గుడివాడ మున్సిపాలిటీ ఎన్నికలతో పాటు జిల్లాలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి విధిగా పాటించాలని కృష్ణా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు అన్నారు. పెనమలూరు పీఎస్‌లో శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పారదర్శకంగా, స్వేచ్ఛగా జరగడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అందరూ సహకరించాలని సూచించారు. ఎన్నికల ప్రచార ర్యాలీలు, బహిరంగ సభలకు ముందస్తు అనుమతులు ఉండాలన్నారు. ప్రచారంలో ఇతర పార్టీల నేతలను ఇబ్బందులు పెట్టకూడదన్నారు. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చకొట్టకూడదని, ఓటర్లను డబ్బు, మద్యం, వస్తువులు పంపిణీ చేసి ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతులు లేకుండా లౌడ్‌ స్పీకర్లు, ఫ్లెక్సీలు కట్టకూడదన్నారు. ఊరేగింపునకు ముందుగానే తేదీ, సమయంతో అనుమతులు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో డీఎస్పీ జయకృష్ణ, పెనమలూరు సీఐ వెంకటనారాయణ, ఎస్‌ఐలు సందీప్‌, సుధాకర్‌, ప్రసాద్‌, తాతాచారి, రమేష్‌, ఉషారాణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement