నందిగామ రూరల్: బాలల ఆరోగ్యానికి పోషకాహారం కీలకమని, చిన్న వయస్సు నుంచే విద్యార్థులు మంచి ఆహార అలవాట్లు నేర్చుకోవాలని ప్రభుత్వ కార్యదర్శి ముదావత్ ఎం.నాయక్ సూచించారు. చందర్లపాడు మండలంలోని ముప్పాళ్ల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో శనివారం నిర్వహించిన బాలల పోషకాహార తోటల పండగ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గురుకులం పాఠశాలలో ముందుగా విత్తనాలు నాటి పోషకాహార తోటను ప్రారంభించారు. ముదావత్ నాయక్ మాట్లాడుతూ, విద్యార్థులు స్వయంగా కూరగాయలు, ఆకుకూరలు, పోషక విలువలున్న మొక్కలను పెంచడం ద్వారా తాజా సహజమైన ఆహారాన్ని పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్ డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి ఎన్.తేజ్ భగత్, అదనపు కార్యదర్శి పద్మావతి, నెట్‌జీరో ఎస్‌పీడీ శరవణన్, జిల్లా డీసీవో మురళీకృష్ణ, ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.


