పటమట(విజయవాడతూర్పు): వీఎంసీ ఎన్నికల నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మేయర్ అభ్యర్థులు, 86 వార్డుల అభ్యర్థులు నిర్వహిస్తున్న ఎన్నికల వ్యయ ఖాతా లను ఎన్టీఆర్ జిల్లా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్, ఐఎఫ్ఎస్ అధికారి బి.విజయకుమార్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు, విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 86 వార్డుల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎన్నికల ప్రచార వ్యయాలకు సంబంధించిన ఖాతా వివరాలను పరిశీలించారు. ఆయనతో పాటు వీఎంసీ అకౌంట్స్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ కె. చక్రవర్తి, అకౌంట్స్ ఆఫీసర్ బి.సత్యనారాయణమూర్తి, అకౌంట్స్ విభాగం సిబ్బంది ఉన్నారు.


