మడక పునరావాస కేంద్రం పరిశీలించిన ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

మడక పునరావాస కేంద్రం పరిశీలించిన ఎస్పీ

Oct 29 2026 2:12 AM | Updated on Oct 29 2026 2:12 AM

పెడన: అర్నబ్‌ తుపాను నేపథ్యంలో పెడన పట్టణంతో పాటు మండలంలో ఏర్పాటు చేసిన 15 పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రాంత ప్రజలను తరలించారు. పునరావాస కేంద్రాల్లో మంగళవారం సాయంత్రం నుంచి వీరికి అల్పాహారంతో పాటు భోజన సౌకర్యాలను కల్పించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు మండల పరిధిలోని మడక ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని బుధవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఎస్పీ వెంట పెడన సీఐ కె.నాగేంద్రప్రసాద్‌, ఎస్‌ఎస్‌ సత్యనారాయణ ఉన్నారు. మండలంలోని పలు కేంద్రాలను పెడన తహసీల్దారు రెహమాన్‌ సందర్శించి సౌకర్యాలపై ఆరా తీశారు. పట్టణంలోని వీరభద్రపురంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌తో పాటు మున్సిపల్‌ కమిషనర్‌ డి.కొండయ్య తదితరులు సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement