విద్యుత్‌ పునరుద్ధరణలో అధికారుల వైఫల్యం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ పునరుద్ధరణలో అధికారుల వైఫల్యం

Oct 29 2026 2:24 AM | Updated on Oct 29 2026 2:24 AM

విద్యుత్‌ పునరుద్ధరణలో అధికారుల వైఫల్యం

చిలకలపూడి(మచిలీపట్నం): అర్నబ్‌ తుపాను ప్రభావంతో మచిలీపట్నంలో మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో గాలులు పెరగడంతో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. అప్పటి నుంచి బుధవారం రాత్రి వరకు నగరంలో కరెంట్‌ సరఫరాను పునరుద్ధరించడంలో అధికారులు ఉదాసీన వైఖరి అవలంభించారు. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ వైర్లు తెగిపడి ట్రాన్స్‌ఫార్మర్లు పడిపోయి మరమ్మతులకు గురయ్యాయి. బుధవారం సాయంత్రం 4 గంటలకు గాలులు, వర్షం తగ్గినప్పటికీ విద్యుత్‌శాఖ సిబ్బంది పనులను చేయడంలో నిర్లక్ష్యం వహించారని ప్రజలు వాపోతున్నారు. విద్యుత్‌ సరఫరా గంటల పాటు నిలిపివేయటంలో వృద్ధులు, చిన్నారులు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే వారు చాలా ఇబ్బందులకు గురయ్యారు సెల్‌ఫోన్లు చార్జింగ్‌లు లేక కమ్యూనికేషన్‌ కూడా పూర్తిగా దెబ్బతింది.

చిమ్మచీకట్లో కలెక్టరేట్‌..

తుపాను ప్రభావాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే కలెక్టరేట్‌కు కూడా విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం తాకింది. కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం వద్ద ఉన్న హోర్డింగ్‌ ఈదురుగాలులకు పడిపోవడంతో కలెక్టరేట్‌కు వెళ్లే విద్యుత్‌ వైరు తెగిపోయింది. బుధవారం రాత్రి 8 గంటల వరకు కూడా కనీసం బోర్డు తీసివేసి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించలేదు. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణపై సమాచారం కోసం ప్రజలు ఆ శాఖా అధికారులకు ఫోన్‌ చేస్తే దురుసుగా సమాధానం చెప్పడం కొసమెరుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement