తిరువూరు మున్సిపల్‌ చైర్మన్‌ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పరసా | - | Sakshi
Sakshi News home page

తిరువూరు మున్సిపల్‌ చైర్మన్‌ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పరసా

Oct 18 2026 2:06 AM | Updated on Oct 18 2026 2:06 AM

తిరువూరు: తిరువూరు పురపాలక సంఘం చైర్మన్‌ అభ్యర్థిగా పరసా శ్రీనివాసరావు పేరును వైఎస్సార్‌ సీపీ ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం రాత్రి విడుదల చేసిన జాబితాలో పరసాకు అవకాశం కల్పించారు. వైఎస్సార్‌ సీపీ ఏర్పడిన నాటినుంచి చురుకై న కార్యకర్తగా పనిచేస్తూ గత మున్సిపల్‌ ఎన్నికల్లో తిరువూరు నగరపంచాయతీ ఏడో వార్డు నుంచి కౌన్సిలర్‌గా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. పార్టీలో పలు హోదాల్లో పదవులు నిర్వహించిన ఆయన ప్రస్తుత ఎన్నికల్లో తిరువూరు మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి పోటీ చేస్తున్నారు. ఆయన డిగ్రీ చదివారు.

చెరకు టన్ను మద్దతు ధర రూ.3,783

ఉయ్యూరు(కంకిపాడు): 2026–27 సీజన్‌కు చెరకు టన్ను మద్దతు ధర రూ.3,783గా కేసీపీ యాజమాన్యం ప్రకటించింది. కర్మాగార ఆవరణలో శనివారం రైతు సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కేసీపీ యూనిట్‌ హెడ్‌ సీతారామదాస్‌ మాట్లాడుతూ ప్రస్తుత చెరకు సీజన్‌కు టన్ను మద్దతు ధర సబ్సిడీతో కలిపి రూ.3,783గా నిర్ణయించామన్నారు. యాంత్రీకరణకు అనువుగా సాగు చేసిన రైతులకు టన్నుకు రూ.3,883 చెల్లించనున్నట్లు ప్రకటించారు. 2027–28 సీజన్‌కు నవంబరు 2026 నుంచి ఫిబ్రవరి 2027 వరకూ నాటే చెరకు మొక్క తోటలకు ఎకరాకు రూ. 20 వేలు సబ్సిడీ ప్రకటించారు. సంప్రదాయ పద్ధతుల్లో నాటిన చెరకు తోటలకు టన్నుకు రూ.400, యాంత్రీకరణకు అనువుగా వేసిన చెరకు తోటలకు టన్నుకు రూ.500 సబ్సిడీ ప్రకటిస్తున్నట్లు చెప్పారు. మొక్కతోటలకు రూ.20 వేలు, పిలక తోటలకు రూ.8 వేలు వడ్డీ లేని రుణం అందిస్తామని తెలిపారు. సమావేశంలో సూరపనేని వెంకట కృష్ణారావు, మోహనరెడ్డి, రత్నగిరిరావు, తిమ్మారెడ్డి, డీజీఎం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

కృష్ణా వర్సిటీ పరీక్షల ఫలితాలు విడుదల

కోనేరు సెంటర్‌: కృష్ణా యూనివర్సిటీలో వివిధ కోర్సులకు సంబంధించిన పరీక్షల ఫలితాలను రిజిస్ట్రార్‌ ఎన్‌.ఉష, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ పి.వీరబ్రహ్మచారి శనివారం విడుదల చేశారు. ఎల్‌ఎల్‌బీ సెకండ్‌ సెమిస్టర్‌ (రెగ్యులర్‌, సప్లిమెంటరీ), బీఏ ఎల్‌ఎల్‌బీ 2, 6 సెమిస్టర్లు (రెగ్యులర్‌, సప్లిమెంటరీ), పోస్టు గ్రాడ్యుయేషన్‌ (పీజీ), ప్రొఫెషనల్‌ కోర్సులు, ఎల్‌ఎల్‌ఎం–2వ సెమిస్టర్‌ (రీవాల్యుయేషన్‌), యూజీ 1, 2, 3, 4, 5, 6వ సెమిస్టర్‌ (2015–2020) వన్‌టైమ్‌ ఆపర్చ్యునిటీ ఫలితాలు విడుదల చేసినట్లు వీరబ్రహ్మచారి తెలిపారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు. పునఃమూల్యాంకనం కోసం ఈ నెల 29లోపు ఫీజు చెల్లించిదరఖాస్తు చేసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement