సర్వజన ఆస్పత్రిలో ట్రామా కేర్‌ విభాగం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

సర్వజన ఆస్పత్రిలో ట్రామా కేర్‌ విభాగం ప్రారంభం

Oct 18 2026 2:06 AM | Updated on Oct 18 2026 2:06 AM

● ప్రమాద బాధితులకు గోల్డెన్‌ అవర్‌లోనే వైద్య సేవలు ● 24 గంటల అత్యవసర సేవలకు ప్రత్యేక మొబైల్‌ నంబర్‌

మచిలీపట్నంఅర్బన్‌: ప్రపంచ ట్రామా దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో (జీజీహెచ్‌) ట్రామా కేర్‌ విభాగాన్ని ప్రారంభించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పద్మశ్రీ తెలిపారు. శనివారం ట్రామా కేర్‌ ప్రారంభంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా జీజీహెచ్‌ ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, ప్రమాద బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. క్యాజువాలిటీ వైద్యాధికారులతో పాటు క్యాజువాలిటీ విభాగాధిపతి, ఆర్‌ఎంఓ డాక్టర్‌ జి. భానుమూర్తి 24 గంటలూ సేవలందిస్తారని తెలిపారు. ట్రామా కేర్‌ సేవల కోసం ప్రత్యేకంగా 94933 19655 అత్యవసర నంబర్‌ను కేటాయించినట్లు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫోన్‌ చేస్తే ట్రామా కేర్‌ బృందం స్పందించి సత్వర వైద్య చర్యలు తీసుకుంటుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement