ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): మన సంస్కృతికి, ఆధ్యాత్మిక జీవనానికి వేదాలే మూలస్తంభాలని దేవదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు పేర్కొన్నారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై మహామండపం ఆరో అంతస్తులో ఆదివారం వేద విద్వత్ సభ జరిగింది. చతుర్వేద పారాయణ పండితుల సన్మాన సభగా నిర్వహించిన కార్యక్రమానికి పలువురు అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. చింతపల్లి ఆంజనేయ ఘనాపాఠి సభా నిర్వహకులుగా వేద పారాయణ, వేద స్వస్తి, ఆశీర్వచన కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 450 మంది ఘనాపాఠీలు, క్రమపాఠీలు, వేదమూర్తులను దేవస్థానం తరఫున సత్కరించి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో దుర్గగుడి ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ, స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, ఆలయ ఏఈవో గంగాధర్, పర్యవేక్షకురాలు హేమదుర్గాంబ, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.


