టీడీపీ మేయర్‌ అభ్యర్థి నామినేషన్‌కు కూలీలు! | - | Sakshi
Sakshi News home page

టీడీపీ మేయర్‌ అభ్యర్థి నామినేషన్‌కు కూలీలు!

Oct 19 2026 7:24 AM | Updated on Oct 19 2026 7:24 AM

● విజయవాడ, గుడివాడ నుంచి ఆటోల్లో తరలింపు ● స్థానిక ప్రజాస్పందన లేకపోవడంతో జనాన్ని తరలించిన టీడీపీ నాయకులు

● విజయవాడ, గుడివాడ నుంచి ఆటోల్లో తరలింపు ● స్థానిక ప్రజాస్పందన లేకపోవడంతో జనాన్ని తరలించిన టీడీపీ నాయకులు

మచిలీపట్నంటౌన్‌: మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో స్థానిక అధికార టీడీపీ నాయకులకు కష్టాలు వచ్చి పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ మేయర్‌ అభ్యర్థి అబ్దుల్‌అబీదా నామినేషన్‌కు కూడా ఇబ్బంది పడ్డారు. నామినేషన్‌ ర్యాలీలో పాల్గొనేందుకు స్థానికంగా జనాల స్పందన కరువైన పరిస్థితి నెలకొంది. దీంతో విజయవాడ, గుడివాడ ప్రాంతాల నుంచి దాదాపు 200 ఆటోల్లో జెండా కూలీలను రప్పించారు. విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్‌ వద్ద పని నిమిత్తం వచ్చే కూలీలను ఆటోకు పదిమంది చొప్పున ఎక్కించుకొని తీసుకొచ్చారు. నామినేషన్‌ ర్యాలీ పూర్తి అయిన తర్వాత ఆటోలో వచ్చిన వారి పేర్లను కొంతమంది మహిళలు నమోదు చేసుకోవడం కనిపించింది. అలాగే డ్రైవర్లు సైతం ఏఏ ఆటోలు వచ్చాయో లిస్టులు తయారు చేసుకున్నారు. పాల్గొన్న జెండా కూలీలకు రూ. 500 చొప్పున కూలి ఇస్తామన్నారని మహిళలు తెలిపారు. కూలీలకు ఇస్తున్న కూలిలో మీడియేటర్‌కు కూడా కొంత ఇవ్వాలని పేర్కొనడం గమనార్హం. విజయవాడ, గుడివాడ ప్రాంతాల నుంచి వచ్చిన ఆటోలతో స్థానిక భెల్‌ కంపెనీ ప్రహరీ వెంబడి, బేబీ సెంటర్‌ నిండిపోయింది. కొంతమంది మహిళలను ‘సాక్షి’ అడగ్గా తాము విజయవాడ కాళేశ్వర మార్కెట్‌, వైఎస్సార్‌ కాలనీ నుంచి వచ్చామని బదులిచ్చారు. రూ. 500 కూలీ ఇస్తామని చెప్పారని కొంతమంది, ఎంతిస్తారో తెలీదని మధ్యవర్తులు ఉన్నారు కదా వాళ్లు తీసుకుని మాకు ఇస్తారని మహిళల పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement