మచిలీపట్నంటౌన్: కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో విఘ్నేశ్వరుడు ధననాథుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆర్టీసీ కాలనీలోని శ్రీ విజయ గణపతి దేవాల యం వద్ద ఏర్పాటు చేసిన మండపంలో గణనాథుడిని కమిటీ సభ్యులు శుక్రవారం రూ.1.11 కోట్ల నగదుతో అ లంకరించారు. రూ. 500, రూ. 200, రూ. 100, రూ. 50 నోట్లతో దండలు తయారు చేసి అలంకరించారు. శుక్రవారం కావడంతో ఆ పందిరి వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు కుంకుమ పూజలు నిర్వహించారు.
గుడివాడరూరల్: లైంగిక వేధింపులపై బాధితురాలి ఫిర్యాదు మేరకు గుడివాడ తాలూకా పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. ఆరేళ్ల క్రితం భర్త వదిలి వెళ్లడంతో వివాహిత తన 18 ఏళ్ల కుమార్తె, కుమారుడితో కలసి జీవిస్తోంది. ఈ క్రమంలో 2023లో ఆమెకు చిదెపూడి సాయికిరణ్ అనే వ్యక్తి పరిచయమై వారితోనే నివసించడం ప్రారంభించాడు. 2024 ఫిబ్రవరిలో వారు టిడ్కో కాలనీకి నివాసం మారారు. అప్పటి నుంచి ఇంట్లో ఆమె, తన కుమారుడు లేని సమయంలో 18 ఏళ్ల యువతిపై సాయికిరణ్ లైంగిక దాడులకు పాల్పడుతూ బలవంతంగా నిర్బంధించేవాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే తల్లిని చంపేస్తానని బెదిరింపులకు గురి చేసేవాడు. వేధింపులు ఎక్కువ కావడంతో యువతి ఈ విషయాన్ని తల్లికి చెప్పింది. తల్లి సాయంలో శుక్రవారం తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు నిందితుడు సాయి కిరణ్‌పై పోక్సో కేసు నమోదు చేశారు.


