స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి | - | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి

Sep 23 2026 2:06 AM | Updated on Sep 23 2026 2:06 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి

వైఎస్సార్‌ సీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి గన్నవరంలో వైఎస్సార్‌ సీపీ విస్తృతస్థాయి సమావేశం

గన్నవరం (హనుమాన్‌జంక్షన్‌రూరల్‌): స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సత్తా చాటాలని ఆ పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌, మాజీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి చెప్పారు. గన్నవరంలో మంగళవారం జరిగిన నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఆళ్ల అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కడికి వెళ్లినా వైఎస్సార్‌ సీపీకి మెజార్టీ ఓటింగ్‌ స్పష్టంగా కనిిపిస్తోందన్నారు. ఆ ఓట్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుగా మలచుకునేందుకు కార్యకర్తలు వ్యూహాత్మకంగా కృషి చేయాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021 నాటి ఫలితాలు పునరావృతం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామ, వార్డు స్థాయిలోకి కార్యకర్తలు వెళ్లి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చాటి చెప్పాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అమలు కానీ, ఆచరణయోగ్యం కానీ హామీలతో చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని, గడిచిన రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వ మోసాన్ని ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు.

నిత్యావసర ధరలు

ఆకాశాన్ని అంటుతున్నాయి..

ఎన్టీఆర్‌కు మనవడినని పదేపదే చెప్పుకునే నారా లోకేష్‌ నిజంగా ఆయన మనవడైతే డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ ఎంకై ్వరీ జరిపించాలని వైఎస్సార్‌ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సవాల్‌ విసిరారు. టీచర్ల ఉద్యోగాలు అమ్ముకున్నారని సాక్ష్యాధారాలతో సహా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బయటపెడితే, ఇంకా నాతో చర్చకు రావాలంటూ నారా లోకేష్‌ ప్రకటించటం అర్థరహితమన్నారు. గడిచిన రెండున్నర ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో లోకేష్‌ ఎన్ని సార్లు విదేశాలకు వెళ్లాడు ? ఎక్కడెక్కడికి వెళ్లాడు ? ఎవరికి కలుస్తున్నాడు ? ఏ అకౌంట్‌ నుంచి విమాన టికెట్లు కొనుగోలు చేస్తున్నారో బహిర్గతం చేయాలని పేర్ని నాని డిమాండ్‌ చేశారు. గొడ్డలి పార్టీ అంటూ పదేపదే వ్యంగ్యంగా మాట్లాడుతున్న నారా లోకేష్‌ ఆసలు ఆ గొడ్డలి ఇప్పుడు ఎక్కడ తిరుగుతోందో, ఎవరితో సావాసం చేస్తుందో గుర్తించాలని, ఆ గొడ్డలి వేటుకు కూడా పోయేది కూడా మీరేనని పేర్ని నాని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎరువుల ధరలు గడిచినా రెండేళ్లలో రెట్టింపు అయ్యాయని, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని దుయ్యబట్టారు. నియోజకవర్గంలో ఒక వైపు ఏలూరు కాలువ, మరో వైపు పొలవరం కాలువ ప్రవహిస్తున్నా ప్రజలకు సాగు, తాగునీరు ఇవ్వటం లేదని, కానీ గ్రామగ్రామాన బెల్ట్‌షాపులు పెట్టి మద్యం మాత్రం ఎరులై పారిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ గన్నవరం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌ సీపీ మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులు జెట్టి గురునాథం, గన్నవరం నియోజకవర్గ పరిశీలకులు షేక్‌ సిలార్‌ దాదా, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement