3 నుంచి బీబీఏ ఆధ్వర్యంలో షటిల్‌ టోర్నమెంట్‌ | - | Sakshi
Sakshi News home page

3 నుంచి బీబీఏ ఆధ్వర్యంలో షటిల్‌ టోర్నమెంట్‌

Sep 23 2026 2:06 AM | Updated on Sep 23 2026 2:06 AM

విజయవాడ లీగల్‌: పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్‌ స్టేడియంలో బీబీఏ ఆధ్వర్యంలో వచ్చే నెల 3, 4 తేదీల్లో ఎన్‌ఆర్‌ఐ కప్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌–2026 నిర్వహించనున్నట్లు బీబీఏ అధ్యక్షుడు విష్ణుభొట్ల లక్ష్మీనారాయణ చెప్పారు. బెజవాడ బార్‌ అసోసియేషన్‌ ప్రాంగణంలో షటిల్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే న్యాయవాదుల పేర్ల నమోదు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మొత్తం మూడు కేటగిరీల్లో పోటీలు జరుగుతాయన్నారు. పోటీల్లో గెలిచిన వారికి రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు అత్యుత్తమ క్రీడా నైపుణ్య ప్రదర్శించిన న్యాయవాదులకు ప్రత్యేక బహుమతులు అందిస్తామని తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే పోటీల్లో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే న్యాయవాదులకు అన్ని వసతులు కల్పిస్తామన్నారు. పోటీల్లో న్యాయవాదులందరూ పాల్గొనవచ్చన్నారు. న్యాయవాదులు తమ దైనందిన జీవితంలో వృత్తిపరమైన ఒత్తిడి నుంచి ఆటవిడుపు పొందుటకు క్రీడలు దోహదపడతాయని చెప్పారు. న్యాయవాదుల్లో ఉన్న సృజనాత్మకత క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవటానికి పోటీలు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ చలసాని అజయ్‌కుమార్‌, జనరల్‌ సెక్రటరీ వలిబోయిన కిరణ్‌కుమార్‌, స్పోర్ట్స్‌ కమిటీ సభ్యులు నిర్మల్‌ రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement