కిడ్నీ వ్యాధితో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

కిడ్నీ వ్యాధితో మహిళ మృతి

Sep 23 2026 2:06 AM | Updated on Sep 23 2026 2:06 AM

కిడ్నీ వ్యాధితో మహిళ మృతి బైక్‌ చోరీ కేసుల్లో నిందితులకు జైలుశిక్ష గుడివాడరూరల్‌: ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో నిందితులకు 10 నెలలు జైలుశిక్ష విధించినట్లు వన్‌టౌన్‌ సీఐ కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ వన్‌టౌన్‌ పరిధిలో గతేడాది డిసెంబర్‌లో రెండు బైక్‌లు చోరీకి గురయ్యాయన్నారు. దీంతో యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ రెండు చోరీ కేసుల్లో దర్యాప్తు చేపట్టి దాసరి దుర్గాప్రసాద్‌, శక ప్రసాద్‌ అలియాస్‌ చిన్నాలను నిందితులుగా గుర్తించి ఈ ఏడాది ఫిబ్రవరి 17న అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. అనంతరం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి చార్జ్‌షీట్‌ దాఖలు చేశామని చెప్పారు. ఎస్‌ఐ పి.కుమారరాజా ఆధ్వర్యంలో సాక్షులను స్థానిక ఏజేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపర్చామన్నారు. ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీ ఆర్‌.గీత వాదనలు వినిపించారన్నారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి డి.అరుంధతి నిందితులకు 10 నెలలు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారని సీఐ చెప్పారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఎ.కొండూరు: మండలంలో కిడ్నీ వ్యాధి మృత్యుఘోష కొనసాగుతోంది. తాజాగా ఎ.కొండూరు తండాకు చెందిన భూక్యా కోమటి(55) కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మంగళవారం మృతి చెందింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె కూలి పని చేసుకుంటూ జీవనం సాగించే వారు. గత ఐదేళ్లగా ఆమె కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ఏడాదిగా క్రియాటిన్‌ పెరగటంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చికిత్స కోసం ప్రైవేట్‌ ఆస్పత్రిలో రూ.2 లక్షలు ఖర్చు చేశారు. అయినా ఆమె ప్రాణాలు దక్కలేదని, క్రియాటిన్‌ అమాంతం పెరగడంతో మంగళవారం మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

చిల్లకల్లు(జగ్గయ్యపేట): ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన షేక్‌ సైదా(50) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. 25 ఏళ్ల క్రితం ఖమ్మంకు చెందిన ఖాదర్‌బీతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. ప్రస్తుతం ఇద్దరు బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. ఆరు నెలల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావటంతో భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో కొంతకాలంగా భార్య, పిల్లలు దూరంగా ఉండటంతో మనస్తాపం చెందిన ఆయన సోమవారం అర్ధరాత్రి ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుడి సోదరుడు నాగుల్‌మీరా ఇంటికి వచ్చి పిలవగా తలుపులు తీయలేదు. అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉండటంటంతో భార్య, కుమారులకు సమాచారం అందించారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ తోట సూర్య శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement