16న విజయవాడలో అమరావతి ప్రాంతీయ సదస్సు | - | Sakshi
Sakshi News home page

16న విజయవాడలో అమరావతి ప్రాంతీయ సదస్సు

Sep 23 2026 2:06 AM | Updated on Sep 23 2026 2:06 AM

16న విజయవాడలో అమరావతి ప్రాంతీయ సదస్సు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్ర– 2047 ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా విశాఖపట్నంలో నవంబర్‌ 12, 13 తేదీల్లో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనున్న నేపథ్యంలో దీనికి ముందు విశాఖపట్నం, కాకినాడ, అమరావతి అనంతపురం, తిరుపతిలో ప్రాంతీయ సదస్సులు జరగనున్నాయని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. అక్టోబర్‌ 16వ తేదీన విజయవాడలో అమరావతి ప్రాంతీయ సదస్సు జరుగుతుందన్నారు. అమరావతి ప్రాంతీయ సదస్సు సన్నద్ధత సమావేశం వర్చువల్‌గా మంగళవారం జరిగింది. సమావేశానికి కలెక్టర్‌ లక్ష్మీశ కలెక్టరేట్‌ శ్రీ ఏవీఎస్‌ రెడ్డి హాల్‌ నుంచి హాజరయ్యారు. కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, ప్రకాశం, మార్కాపురం జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అమరావతి ప్రాంతీయ సదస్సుకు ఆయా జిల్లాల నుంచి చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. జిల్లాల ప్రత్యేకతలు, విశిష్ట వనరులు, అవకాశాలకు అనుగుణంగా పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, ఎంఎస్‌ఎంఈల భాగస్వామ్యం, స్థానిక పరిశ్రమల ప్రోత్సాహం, విద్యా–పరిశ్రమల అనుసంధానంపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ.. విజయవాడలో అమరావతి ప్రాంతీయ సదస్సును పెద్దఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వివరాలకు 91549 70454 (కలెక్టరేట్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం/ఇన్వెస్టర్స్‌ డెస్క్‌) నంబరులో సంప్రదించాలని కలెక్టర్‌ లక్ష్మీశ సూచించారు. సమావేశంలో ఎన్టీఆర్‌ జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు, ఎనిమిది జిల్లాల పరిశ్రమలు, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement