వైభవంగా సహస్ర గళ భగవద్గీత పారాయణం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా సహస్ర గళ భగవద్గీత పారాయణం

Sep 13 2026 9:10 AM | Updated on Sep 13 2026 9:10 AM

మైలవరం: మైలవరంలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో సహస్ర గళ భగవద్గీత పారాయణ కార్యక్రమం శనివారం వైభవంగా జరిగింది. శ్రీ గణపతి సచ్ఛిదానందస్వామీజీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణ మహాయజ్ఞంలో భాగంగా ద్వారకా తిరుమల దేవస్థానాల చైర్మన్‌ ఎస్వీ సుధాకరరావు ప్రోత్సాహంతో కార్యక్రమం నిర్వహించామని నిర్వాహకులు వి.బాలాజీ ప్రసాద్‌ తెలిపారు. కార్యక్రమంలో ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లాల నుంచి 800 మంది పారాయణ సభ్యులు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల దేవస్థానాల వంశపారంపర్య ధర్మకర్త ఎస్వీ నివృతరావు ఆధ్వర్యంలో పాల్గొన్న వారందరికీ అల్పాహారం, భోజనం ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మైలవరం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బయన శ్రీనివాసరావు, లయన్స్‌ క్లబ్‌ సభ్యులు జాస్తి వెంకటేశ్వరరావు, అలమూరు చంద్రశేఖరరావు, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా స్థానిక వినాయకుని దేవాలయం నుంచి శోభాయాత్ర జరిగింది. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement