కోనేరుసెంటర్: జిల్లా పోలీసు కార్యాలయంలో మీ కోసం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు ఆదివారం తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు అందజేసి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని సబ్–డివిజన్లలోనూ మీకోసం కార్యక్రమం జరుగుతుందన్నారు. సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రాలేని బాధితులు తమకు సమీపంలోని పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వహించే ఎస్‌హెచ్‌ఓలను కలిసి తమ సమస్యలపై అర్జీలు అందజేయాలని చెప్పారు. సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మీకోసంలో అర్జీలు స్వీకరిస్తామని ఎస్పీ తెలిపారు.


