ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న అన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. విజయవాడ ఎనికేపాడు కేవీఆర్ కాల నీకి చెందిన పి.రవిశంకర్ దంపతులు అమ్మవారిని దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి రూ.1,00,116 విరాళం అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన చుండూరి శ్రీనివాసరావు దంపతులు అన్నదా నానికి రూ.లక్ష విరాళం సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మ వారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీ ర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఏఈఓ ఎన్.రమేష్‌బాబు, ఆలయ అధికారి శ్రీనివాసరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించాలి
పామర్రు: వీఆర్‌ఏలు నాలుగు దశాబ్దాలుగా తక్కువ జీతంతో పని చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే జీతాలను పెంచా లని కృష్ణాజిల్లా వీఆర్‌ఏల సంఘ అధ్యక్ష కార్యదర్శిలు బొడ్డు వెంకటరత్నం, చాట్ల రమేష్ డిమాండ్ చేశారు. స్థానిక ఆర్ అండ్ బీ గెస్టు హౌస్‌లో జిల్లాలోని ఆయా మండలాల అధ్యక్షులతో కలిసి శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హత ఉన్న వారికి వెంటనే ప్రమోషన్లు ఇవ్వా లని కోరారు. తక్కువ జీతాలతో వీఆర్‌ఏలు దుర్భర జీవితాలు గడుపుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌ఏలు ఎం.గోపి, జై.బాబుజీ పాల్గొన్నారు.
కుటుంబ సభ్యులు మందలించారని ఆత్మహత్య
గన్నవరం: కుటుంబ సభ్యులు మందలించా రని ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ముస్తాబాదలో శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ముస్తాబాదకు చెందిన నర్రా నాగసాయిరామ్(30) గ్రామంలో షామియానా దుకాణం నడుపుతున్నాడు. అతని భార్య ప్రసవం నిమిత్తం ఇటీవల పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి అతను రోజు మద్యం తాగుతున్నాడు. నాగసాయిరామ్‌ను తండ్రి, సోదరుడు గట్టిగా మందలించారు. మనస్తాపా నికి గురైన నాగసాయిరామ్ ఉదయం 11 గంట లకు ఇంటిలో ఎవరు లేని సమయంలో సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. అనంతరం కుటుంబ సభ్యులు గమనించి చూడగా అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అంతర్జాతీయ అంధ క్రికెటర్లకు ఉచిత ఆరోగ్య బీమా
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): దేశం తరఫున అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న అంధ క్రికెటర్లకు తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.10 లక్షల చొప్పున ఆరోగ్య పాలసీని కల్పిస్తున్నామని ఎంపీ, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు కేశి నేని శివనాథ్ తెలిపారు. నగరంలోని ఏసీఏ కార్యాలయంలో అంధ క్రీడాకారులకు ఆరోగ్య పాలసీ పత్రాలను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ.. ఐదుగురు అంధ క్రికెటర్లకు రూ.10 లక్షల చొప్పు ఆరోగ్య బీమా కవరేజ్ కలిగిన పాలసీలను అందజేశామన్నారు. ఏసీఏ ప్రధాన కార్యదర్శి సానా సతీష్‌బాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగ క్రికెట్ అభివృద్థికి ఏసీఏ అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇ.అజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడాకారులకు ఆరోగ్య పాలసీ చేయడం సంతోషంగా ఉందన్నారు. భారత అంధుల క్రికెట్ జట్టు ప్రస్తుత కెప్టెన్ దుర్గారావు, క్రీడాకారులు వెంకటేష్, రవి, దున్నా వెంకటేశ్వరరావు, కుమారి సత్యవతి పాలసీ పత్రాలను అందుకున్నారు. డెఫ్ క్రికె టర్ యశ్వంత్ నాయుడును, శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ డెఫ్ అండ్ డంబ్ ఉమెన్స్ క్రికెట్ టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచిన కుమారి జోష్నారెడ్డిని సత్కరించారు. భారత అండర్–19 మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికై న కాట్రగడ్డ దీక్షను శివనాథ్ అభినందించారు. అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్‌రట్ర కార్యదర్శి జి. రవీంద్రబాబు, డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


