జగ్గయ్యపేట అర్బన్: తరగతులకు గైర్హాజరవుతున్న విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకొని వారు పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.చంద్రకళ ఆదేశించారు. పట్ట ణంలోని జీవీజే జెడ్పీ బాలుర హైస్కూల్‌ను డీఈఓ చంద్రకళ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలు తీరును పరిశీలించి తగు సూచనలు చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై పాఠశాల స్టార్ రేటింగ్ గురించి అడిగి, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, సంగ్రహణాత్మక మూల్యాంకనం, పదో తరగతి ఫలితాలపై చర్చించారు. వీటి ప్రకారమే పాఠశాలకు స్టార్ రేటింగ్ వస్తుందని తెలిపారు. విద్యార్థుల హాజరు శాతం పెరగాలని స్పష్టంచేశారు. పాఠశాలకు గైరుహాజరవుతున్న విద్యార్థులను ఒక్కొక్క ఉపాధ్యాయుడు నలుగురు చొప్పున దత్తత తీసుకుని వారు విధిగా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని సూచించారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెరగాలని సూచించారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నందిగామ డీవైఈఓ జి.గురునాథం, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.వి.నాగేశ్వరరావు, పలువురు ఉపాధ్యా యులు పాల్గొన్నారు.
పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెరగాలి
Aug 21 2026 7:39 AM | Updated on Aug 21 2026 7:39 AM
పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెరగాలి నిత్యాన్నదానానికి
పలువురి విరాళాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గురువారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ పరిధిలోని కొత్తపేటకు చెందిన విజ్జువరం బసవపూర్ణచంద్రారెడ్డి కుటుంబం అమ్మ వారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళం అందజేశారు. రాజమండ్రి గాంధీపురానికి చెందిన గంగిన రాజేశ్వరరావు అమ్మవారి అన్నదానానికి రూ.1,00,001 విరాళం సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ డీఈఓ కిషోర్‌కుమార్, ఆలయ పర్యవేక్షకుడు నాగేశ్వరరావు, అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
Advertisement


