జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక
చిలకలపూడి(మచిలీపట్నం): స్వాతంత్య్రం కోసం మహనీయులు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. జిల్లా పరిషత్ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసి గౌరవవందనం చేశారు. అనంతరం మహాత్మాగాంధీ, బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. జిల్లా పరిషత్‌లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి సర్టిఫికెట్లను అందజేశారు. డెప్యూటీ సీఈవో ఆర్సీ ఆనంద్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను సినీ నటి శ్రీలీల, బాల నటుడు బుల్లిరాజు(రేవంత్)శనివారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన వారిరువురికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు, అర్చకులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు శనివారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. కానూరుకు చెందిన బి.శిల్పి, బి.సనీల కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా వారు ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,00,116ల విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు.


