ఆలోచనలు రేకెత్తించిన ఛాయాచిత్రాలు | - | Sakshi
Sakshi News home page

ఆలోచనలు రేకెత్తించిన ఛాయాచిత్రాలు

Aug 15 2026 2:21 AM | Updated on Aug 15 2026 2:21 AM

ఆలోచనలు రేకెత్తించిన ఛాయాచిత్రాలు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో ఛాయాచిత్రాలు ప్రతి ఒక్కరిలో ఆలోచనలు రేకెత్తించేలా ఉన్నాయని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ అన్నారు. ప్రతి ఛాయాచిత్రం కళాత్మక సందేశాన్ని అందించిందన్నారు. విజేతలకు అభినందనలు తెలియజేశారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లోని ఏవీఎస్‌ రెడ్డి హాలులో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఫొటోగ్రఫీ పోటీల్లో విజేతల వివరాలను ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫొటోగ్రాఫర్లలో నైపుణ్యాన్ని పెంచడంతో పాటు వారిని ప్రోత్సహించేందుకు ఏటా ఫొటోగ్రఫీ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, యువత, పీ4, ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం, ఉత్తమ వార్తా చిత్రాలు విభాగాల్లో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో మొత్తం 221 ఎంట్రీలు రాగా 27 ఛాయాచిత్రాలను జ్యూరీ సభ్యులు ఉత్తమమైనవిగా ఎంపిక చేశారన్నారు. పోటీలలో వైవీవీ సత్యనారాయణ ప్రథమ బహుమతి, ఎన్‌.కిషోర్‌ ద్వితీయ బహుమతి, ఎం.ప్రశాంత్‌ తృతీయ బహుమతి సాధించారన్నారు. యు.దుర్గా రావు, పి.ప్రసాద్‌, వైవీ ఆనంద్‌, ఆర్‌వీ అప్పారావు, కె.తిరుపతయ్య, కేబీ నవీన్‌ ప్రోత్సాహక బహుమతులు సాధించారని తెలిపారు. కేటగిరీ 2లో జీఎన్‌ రావు(ప్రథమ), సీహెచ్‌ నారాయణరావు(ద్వితీయ),ఎస్‌ఎస్‌ విజయ బాబు(తృతీయ) బహుమతులు, సీహెచ్‌ మస్తాన్‌, మణికంఠ, సీహెచ్‌ నారాయణ రావు, బి.సతీష్‌ కుమార్‌, రాజేష్‌, బి.మరి డయ్య ప్రోత్సాహక బహుమతులు సాధించారన్నారు. కేటగిరీ 3లో కేవీఎస్‌ గిరి(ప్రథమ), ఎ.రాజేంద్రప్రసాద్‌(ద్వితీయ),దుర్గా ప్రసాద్‌( తృతీయ) బహుమతులు పొందా రని, ఎ.రామచంద్రరావు, కె.చక్రపాణి, జి.మహేష్‌, బి.మరిడయ్య, ఎం.సంపత్‌ కుమార్‌, ఎస్‌.లక్ష్మీపవన్‌ ప్రోత్సాహక బహుమతులకు ఎంపికై నట్లు కలెక్టర్‌ ప్రకటించారు. ఈనెల 19న బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్య క్రమంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్‌డీవో వెన్నెల శ్రీను, జ్యూరీ సభ్యులు సీహెచ్‌ విజయభాస్కర్‌, టీఎస్‌రెడ్డి, కె.రవికుమార్‌, టి.నాగేశ్వరరావు, డాక్టర్‌ రజియా షబీనాలతో పాటు డివిజనల్‌ పీఆర్‌వో కె.రవి, రిటైర్డ్‌ ఏవీఎస్‌ వీవీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement