గుడివాడరూరల్: ఏపీఎన్‌జీవో, ఎన్‌జీవో అసోసియేషన్ రాష్ట్ర స్థాయి ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. కృష్ణాజిల్లా గుడివాడలోని ఎన్జీవో హోమ్‌లో గుడివాడ సర్కిల్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షులుగా వట్టిపల్లి రామస్వామి, జనరల్ సెక్రటరీగా కెఎవిఎల్‌ఎన్‌వి ప్రసాద్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా వి.అజయ్‌కుమార్, వైస్ ప్రెసిడెంట్–1గా జి.ధనంజయ్, వైస్ ప్రెసిడెంట్–2గా కె.గోపాలరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా డి.వెంకటేష్, స్టేట్–1, 2 సెక్రటరీలుగా డి.కార్తీకప్రసాద్, పి.పూర్ణచంద్రరావు, స్టేట్ ట్రెజరర్‌గా టి.సాయి కిరణ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నూతన కమిటీ సభ్యులను అసోసియేషన్ సభ్యులు సన్మానించి సత్కరించారు.


