గంజాయి విక్రేతల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి విక్రేతల అరెస్ట్‌

Aug 11 2026 2:12 AM | Updated on Aug 11 2026 2:12 AM

గంజాయి విక్రేతల అరెస్ట్‌

గన్నవరం: గంజాయి అక్రమంగా రవాణా చేస్తూ విక్రయిస్తున్న ఏడుగురు యువకుల ముఠా సోమవారం ఉంగుటూరు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ మేరకు సోమవారం ఉంగుటూరు పోలీస్‌స్టేషన్‌లో నిందితులను అరెస్ట్‌ చూపించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ యూ గోవిందు మాట్లాడుతూ.. నూజివీడుకు చెందిన షేక్‌ సిద్ధిక్‌ హుస్సేన్‌బాషా, కస్తూరి హర్షవర్ధన్‌ అరకు ఏజెన్సీ ఏరియాలో గంజాయి కొనుగోలు చేసి మండల పరిధిలో విక్రయాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని గారపాడు వద్ద గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి దాడి చేసినట్లు తెలిపారు. బాషా, హర్షవర్ధన్‌తో పాటు మానికొండకు చెందిన కస్తూరి కార్తీక్‌, గోగు సంతోష్‌, ఆరేపల్లి సురేష్‌, చిట్టిపోతుల ప్రభు, చాట్ల చైతన్యను కూడా అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రెండు కేజీల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు గంజాయికి అలవాటు పడడంతో పాటు సులభంగా డబ్బు సంపాదించేందుకు గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. కేసులో ఏ–1 నిందితుడైన హుస్సేన్‌బాషాపై మాచవరం, విజయవాడ టూ టౌన్‌, వీరవల్లి, ఏలూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు. అనంతరం నిందితులను గన్నవరం కోర్టులో హాజరుపరచగా జడ్జి 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement