దుర్గగుడిపై శ్రావణ సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

దుర్గగుడిపై శ్రావణ సన్నాహాలు

Aug 11 2026 1:54 AM | Updated on Aug 11 2026 1:54 AM

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో శ్రావణ మాసం ఉత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఈవో శీనానాయక్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం మహామండపం నాలుగో అంతస్తులోని ఈవో చాంబర్‌లో ఆలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసం నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. కుంకుమార్చనకు డిమాండ్‌ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, భక్తులకు లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన టికెట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

12న దుర్గగుడి సిబ్బంది సారె

ఈ నెల 12వ తేదీ దుర్గగుడి సిబ్బంది, అధికారులు అమ్మవారికి సారెను సమర్పించనున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.

రాజగోపురం ఎదుట జెండా వందనం

‘స్వాతంత్య్ర’ వేడుకలను ఈ ఏడాది రాజగోపురం ఎదుట నిర్వహించాలని ఈవో ఆలయ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఈవో కిషోర్‌కుమార్‌, ఎసీ రంగారావు, ఎఈవోలు ఎన్‌. రమేష్‌బాబు, గంగాధర్‌, స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ, ఈఈ ఎల్‌.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement