అజయ్‌బాబు విజయం యువతకు స్ఫూర్తిదాయకం | - | Sakshi
Sakshi News home page

అజయ్‌బాబు విజయం యువతకు స్ఫూర్తిదాయకం

Aug 7 2026 3:59 AM | Updated on Aug 7 2026 3:59 AM

అజయ్‌బాబు విజయం యువతకు స్ఫూర్తిదాయకం

మొగల్రాజపురం(విజయవాడతూర్పు): కామెన్‌వెల్త్‌ గేమ్స్‌లో రాష్ట్రానికి చెందిన వల్లూరి అజయ్‌బాబు వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకుని యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాథికార సంస్థ(శాప్‌) చైర్మన్‌ ఏ. రవినాయుడు, వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌.భరణి చెప్పారు. స్థానిక బందరురోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం ఆవరణలోని శాప్‌ కార్యాలయంలో అజయ్‌బాబును గురువారం సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌, ఒలింపిక్స్‌ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పోటీల్లోనూ అజయ్‌బాబు ప్రతిభ చూపి పతకాలు పొందాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement