బధిరుల బ్యాడ్మింటన్‌లో నాగూర్‌పాషా సత్తా | - | Sakshi
Sakshi News home page

బధిరుల బ్యాడ్మింటన్‌లో నాగూర్‌పాషా సత్తా

Aug 7 2026 3:59 AM | Updated on Aug 7 2026 3:59 AM

బధిరుల బ్యాడ్మింటన్‌లో నాగూర్‌పాషా సత్తా కనకదుర్గానగర్‌లో భక్తుడి మృతి

ఇబ్రహింపట్నం: బధిరుల జాతీయ స్థాయి బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌–2026 పోటీల్లో కొండపల్లికి చెందిన మహమ్మద్‌ నాగూర్‌ పాషా ప్రతిభ చాటి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. ఇటీవల హైదరాబాద్‌ మొయినాబాద్‌లోని జ్వాలా గుట్టా అకాడమీ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో డెఫ్‌ ఎనేబిల్డ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యాన జరిగిన జాతీయ బ్యాడ్మింటన్‌ పోటీల్లో మహమ్మద్‌ నాగూర్‌ పాషా అద్భుత ప్రదర్శనతో రెండు విభాగాల్లో రన్నరప్‌గా నిలిచారు. పాషా సింగిల్స్‌ విభాగంలో రన్నరప్‌, డబుల్స్‌ విభాగంలోనూ రన్నరప్‌గా నిలిచి ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు తీసుకొచ్చారు. పలు క్రీడల్లో జాతీయ స్థాయిలో అతను రాణిస్తున్నారు. క్రీడా ప్రముఖులు, సహచరులు అతన్ని అభినందించారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి సమీపంలోని కనకదుర్గనగర్‌లో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని భక్తుడు మృతి చెందాడు. సుమారు 50 నుంచి 60 సంవత్సరాల ఉన్న వ్యక్తి శరీరంపై బనియన్‌, గ్రీన్‌ లుంగీ, చేతికి వాచీ ఉన్నాయి. మృతదేహాన్ని చూసిన పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అతని వద్ద గుర్తింపు ఆధారాలేమైనా ఉన్నాయా అని పరిశీలించారు. అతని వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

తమ వ్యక్తి కనిపించడం లేదని ఆలయ మైక్‌ ప్రచార కేంద్రానికి , పోలీస్‌ అవుట్‌పోస్టుకు ఎవరూ రాకపోవడంతో ఒంటరిగా గుడికి వచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రి మార్చరీలో భద్రపరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement