ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ దివ్య మంగళ రూపాన్ని చూసిన జూలియన్ హిల్ దంపతులు తన్మయత్వం చెందారు. ఆలయంలో జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి భక్తులు సమర్పిస్తున్న సారె గురించి అడిగి మరీ తెలుసుకు న్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలు వైన దుర్గమ్మను ఆస్ట్రేలియా పౌరసత్వ, కస్టమ్స్, బహుళ సంస్కృతుల వ్యవహారాలు, అంతర్జాతీయ విద్యాశాఖ సహాయ మంత్రి జూలియన్ హిల్ దంపతులు, బృంద సభ్యులు శనివారం దర్శించుకున్నారు. అమ్మ వారి దర్శనానికి విచ్చేసిన జూలియన్ హిల్ దంపతులను ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాశస్త్యాన్ని, మహిమలను, ఆలయంలో జరుగుతన్న ఆషాఢ సారె ఉత్సవ విశేషాలను ఆలయ వేద పండితులు వివరించారు. అనంతరం జూలియన్ హిల్ దంపతులకు ఈఓ, చైర్మన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు. అమ్మవారి దర్శనానికి అంతర్జాతీయ ప్రతినిధులు విచ్చేయడంతో ఆలయ అధికారులతో పాటు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఎల్.డి.ప్రసాద్, స్థానాచార్య శివప్రసాద్ శర్మ, అర్చకుడు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, డీఈఓ కిషోర్‌కుమార్, ఏఈఓ ఎన్.రమేష్‌బాబు పాల్గొన్నారు.
ఎంతో మంది ఉద్దండులు సేవలు అందించిన జెడ్పీ చైర్మన్ స్థానంలో తాను ఉండటం తన అదృష్టమని ఉప్పాల హారిక అన్నారు. ఆధునికీకరించిన జెడ్పీ సమావేశ మందిరాన్ని ప్రారంభించారు.


