లబ్బీపేట(విజయవాడతూర్పు): సైబర్ నేరాలను నియంత్రించడమే లక్ష్యంగా చేసుకుని పోలీసు అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు అన్నారు. ఏపీకే ఫైల్స్ ద్వారా జరిగే నేరాలను ఛేదించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై పోలీసు అధికారులు సైతం అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. పోలీస్ కమిషనరేట్‌లో సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారులను పాటు, అన్ని పోలీస్‌స్టేషన్‌ల అధికారులు, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు బాధితుడితో మాట్లాడేటప్పుడు సేకరించాల్సిన సమాచారం, సాక్ష్యాలను సేకరించే విధానం తదితరాలను వివరించారు.
మాట్లాడుతున్న సీపీ రాజశేఖరబాబు


