ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం మహిళలు సిగపట్లు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం మహిళలు సిగపట్లు

Aug 22 2025 6:53 AM | Updated on Aug 23 2025 9:09 AM

-
శుక్రవారం శ్రీ 22 శ్రీ ఆగస్టు శ్రీ 2025 అరకొర సర్వీసులు.. మహిళల పాట్లు బాధ్యతల స్వీకరణ ఉచితంగా చెస్‌ శిక్షణ శిబిరాలు ఉచిత ప్రసాద వితరణకు విరాళం –10లోu అంతర్రాష్ట్ర బస్సుల్లో ఉచిత ప్రయాణం కోరుతూ ధర్నా కృష్ణా కలెక్టర్‌కు అవార్డు

న్యూస్‌రీల్‌

ఉచిత ప్రయాణం చేయాలంటే ఫీట్లు చేయాల్సిన పరిస్థితి బస్సుల్లో నిత్యం మహిళల గలాటా రద్దీకి తగ్గట్టుగా పెంచని సర్వీసులు ఉన్న బస్సులతోనే సరి అంతర్రాష్ట్ర సర్వీసుల పేరుతో కోత

అంతర్రాష్ట్ర సర్వీసుల్లో సౌకర్యం కల్పించాలి..

తిరువూరు: సూపర్‌ సిక్స్‌ హామీల అమల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని అన్ని రూట్లలో వర్తింపజేయాలని కోరుతూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళాసంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో గురువారం తిరువూరులో ధర్నా చేశారు. స్థానిక ఫ్యాక్టరీ సెంటర్లో నిర్వహించిన ధర్నాలో ఐద్వా జిల్లా నాయకురాలు ఎస్‌. కుమారి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడి నుంచి ఎక్కడికై నా మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు సీ్త్రశక్తి పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించినా, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో మాత్రం ఈ పథకం అమలు చేయట్లేదన్నారు. వెంటనే అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేకల నాగేంద్రప్రసాద్‌, ఐద్వా సభ్యులు తులసీరాణి, రవికుమారి, నాగమణి, సీపీఎం నాయకులు పి. శ్రీనివాసరావు, గుళ్లపల్లి వెంకటరత్నం, ఎస్‌వీ భద్రం, ఆకుల రవి, వెంకటరత్నం, ఉమామహేశ్వరరావు, నాగుల్‌మీరా పాల్గొన్నారు.

చిలకలపూడి(మచిలీపట్నం): ఉత్తమ ఐఏఎస్‌ అధికారిగా అవార్డు, ప్రశంసాపత్రాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అందుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో నాలుగు వారాల పాటు జరిగిన మిడ్‌ క్యారియర్‌ శిక్షణ కార్యక్రమంలో అన్ని విభాగాల్లో ప్రతిభ కనబరిచినందుకు ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. దీంతో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆనంద్‌బర్దన్‌ నుంచి ప్రశంసాపత్రాన్ని ఆయన స్వీకరించినట్లు సమాచార పౌరసంబంధాలశాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం మహిళలు సిగపట్లు పడుతున్నారు. మొన్న విజయవాడ– ఏలూరు బస్సులో, నిన్న విజయవాడ – జగ్గయ్యపేట ఎక్స్‌ప్రెస్‌లో సీట్ల కోసం కొట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అవుతున్నాయి. సీ్త్రశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన నాటి నుంచి ఇవి నిత్యకృత్యమవుతున్నాయి. ఆర్భాటంగా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేదు. ప్రస్తుతం నడుపుతున్న సర్వీసుల్లో కేవలం ఐదు కేటగిరీల్లో మాత్రమే పథకం వర్తింపజేసింది. ఉన్న బస్సులతోనే ఉచిత ప్రయాణం కావడంతో రద్దీ ఎక్కువై సీట్ల కోసం మహిళలు నిత్యం అవస్థలు పడుతున్నారు.

తాంబూలాలిచ్చేశాం..
ఏడాదిగా ప్రకటిస్తూ.. వాయిదా వేస్తూ వచ్చిన కూటమి ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎట్టకేలకు సీ్త్ర శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభించింది. అయితే ఆర్టీసీ నడుపుతున్న అన్ని సర్వీసులకు కాకుండా కేవలం 5 సర్వీసుల్లోనే ప్రయాణానికి అనుమతించింది. ఎన్టీఆర్‌ జిల్లాలో 470 బస్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సుమారు 2.50లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేసినప్పటికీ అందుకు తగ్గట్టు సర్వీసులు పెంచలేదు. ఇప్పటికీ ఎర్రబస్సు ముఖం చూడని గ్రామాలు అనేకం ఉన్నాయి. వాటికి సర్వీసులు నడిపే ప్రయత్నం చేయలేదు. దీనికి తోడు అంతర్రాష్ట్ర సర్వీసుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి లేకపోవడంతో జిల్లాలో సగానికి పైగా గ్రామాల ప్రజలకు ఉచిత ప్రయాణం అందే పరిస్థితి లేకుండా పోయింది.

రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఇబ్బందులు..
జిల్లాలో 8 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. తిరువూరు, జగ్గయ్యపేట డిపోలు రూరల్‌ ప్రాంతంలో రాష్ట్ర సరిహద్దులో ఉన్నాయి. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ నుంచి ప్రారంభమై ఇటు తిరువూరు వరకు, అటు జగ్గయ్యపేట వరకు విస్తరించింది. విస్సన్నపేట, తిరువూరు, జగ్గయ్యపేట పట్టణాలు తెలంగాణతో సరిహద్దును పంచుకుంటున్నాయి. విజయవాడ నుంచి తిరువూరు 85 కిలోమీటర్లు, విజయవాడ నుంచి జగ్గయ్యపేట వరకు 80 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. మైలవరం, నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేట నియోజకవర్గాలు తెలంగాణ సరిహద్దులో ఉన్నాయి. రెండు రాష్ట్రాలలో కొన్ని గ్రామాల్లో బస్సులు నడుస్తున్నాయి. అవికాస్తా అంతర్రాష్ట్ర సర్వీసులు కావడంతో వాటిల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం లేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో మహిళలకు పేరుకే ఉచిత బస్సు అన్న చందంగా ఉంది.

వాళ్లేం పాపం చేశారు?
జగ్గయ్యపేట, తిరువూరు డిపోలు అటు కోదాడ, వైరా, ఖమ్మం, మధిర తదితర ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నాయి. ఆయా ప్రాంతాలకు వెళ్లాలంటే సగానికి పైగా ఆంధ్ర ప్రాంత గ్రామాలను దాటుకుని వెళ్లాలి. అయినప్పటికీ పల్లె వెలుగు కూడా అంతర్రాష్ట్ర సర్వీసు కావడంతో మహిళలు అవకాశం కోల్పోతున్నారు. పథకం ఉన్నప్పటికీ చార్జీలు పెట్టుకోవాల్సిన దుస్థితి. సరిహద్దు గ్రామాల్లో పనులకు వెళ్లే వారు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఉదాహరణకు జగ్గయ్యపేట– వైరా వెళ్లే బస్సులో ఎక్కితే ఆంధ్రలోని వత్సవాయి గ్రామం వరకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలి. కానీ అంతర్రాష్ట్ర సర్వీసు పేరుతో ఉచితానికి ఎగనామం పెడుతున్నారు. సరిహద్దులో ఉన్న తామేం పాపం చేసుకున్నామని మహిళలు నిలదీస్తున్నారు.

ఆ రూట్‌లో మధిర డిపో బస్సులే అధికం...
విజయవాడ నుంచి మధిర వయా కంచికచర్ల రూట్‌లో మధిర డిపో 15 సర్వీసులు నడుపుతోంది. గంటకో ట్రిప్పు చొప్పున ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సర్వీసులు నడుస్తున్నాయి. ఈ రూట్‌లో పరిమిత సంఖ్యలోనే విజయవాడ డిపో బస్సులు ఉన్నాయి. విజయవాడ – జమలాపురం, విజయవాడ – బనిగండ్లపాడు మధ్య నడిచే బస్సులు తెలంగాణ రాష్ట్రానికి వెళతాయి. వీటిని అంతర్రాష్ట్ర సర్వీసులుగా పరిగణించడంతో పథకం వర్తించడం లేదు. ఆ రూట్‌లో వీరులపాడు వెళ్లే బస్సు ఉదయం రెండు ట్రిప్పులు, సాయంత్రం రెండు ట్రిప్పులు వేస్తున్నారు. ఈ మార్గంలో వీరులపాడు మండలాన్ని పూర్తిగా కలుపుతూ రింగ్‌ బస్సులు తిప్పాలని మహిళలు డిమాండ్‌ చేస్తున్నారు. అప్పుడే పథకం వల్ల తమకు ప్రయోజనం అంటున్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా తెలంగాణ తో సరిహద్దు కలిగి ఉంది. ముఖ్యంగా జగ్గయ్యపేట, తిరువూరు ప్రాంత ప్రజలకు ఉచిత సౌకర్యం పొందలేకపోతున్నారు. అంతర్రాష్ట్ర సర్వీసులకు ఉచిత సదుపాయం కల్పించాలి. అదనపు బస్సులు కేటాయించాలి.

– తన్నీరు నాగేశ్వరరావు, వైఎస్సార్‌ సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌చార్జి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement