
స్వాతంత్య్ర వేడుకలకు సర్వంసిద్ధం
కోనేరుసెంటర్(మచిలీపట్నం): స్వాతంత్య్ర దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వేడుకలకు అవసరమైన ఏర్పాట్లను గురువారం పోలీస్, రెవెన్యూ, మునిసిపల్ అధికారులు దగ్గరుండి చేయించారు. షామియానాలు వేసి నేలను రబ్బీసుతో చదును చేయించారు. టెంట్‌ల కింద పచ్చటి తివాచీలు పరిచారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమాలను వీక్షించేందుకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఏర్పాట్లును ఎస్పీ ఆర్. గంగాధర్‌రావు పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీసు సిబ్బంది రిహార్సల్స్ చేయగా, వారి నుంచి ఎస్పీ గౌరవవందనం స్వీకరించారు. పరేడ్ కమాండర్‌గా బందరు డీఎస్పీ సీహెచ్.రాజా వ్యవహరించారు.

స్వాతంత్య్ర వేడుకలకు సర్వంసిద్ధం