
బస్టాండ్‌లో భద్రతా ఏర్పాట్ల పరిశీలన
లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళలకు ఉచిత బస్సు (సీ్త్ర శక్తి) పథకాన్ని ప్రారంభించేందుకు విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టేషన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం వస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను గురువారం పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు పరిశీలించారు. బస్టాండ్‌తో పాటు, పరిసర ప్రాంతాల్లో భద్రతా పరంగా ఎలాంటి చిన్న లోపాలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్నిశాఖల అధికారుల సమ న్వయంతో అప్రమత్తంగా ఉంటూ, బందో బస్తు నిర్వహించాలని సూచించారు. ముఖ్య మంత్రితో పాటు, మంత్రులు, వీవీఐపీలు, ఇతర అధికారులు ప్రయాణించే మార్గాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, పార్కింగ్ ప్రదేశాలు, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు కె.జి.వి. సరిత, ఎస్.వి.డి.ప్రసాద్, ఏడీసీపీ ఎ.వి.ఎల్. ప్రసన్నకుమార్, సౌత్ ఏసీపీ పావన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నేడు సీ్త్రశక్తి పథకం ప్రారంభం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం సీ్త్ర శక్తి పథకం శుక్రవారం ప్రారంభమవుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనే ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారులు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. విజయవాడ బస్టాండ్‌లో ఏర్పాట్లను కలెక్టర్ సమన్వయ శాఖల అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, ఆర్డీఓ కావూరి చైతన్య, వివిధ జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): వరద ప్రభావిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లోని సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని ఆదేశించారు. నగరంలోని న్యూరాజరాజేశ్వరిపేట, ఇబ్రహీంపట్నం, చినలంక సడక్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో ఆమె గురువారం పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను పరిశీలించారు. అదే విధంగా సడక్‌రోడ్డు ప్రాంతంలో వరద తీవ్రతను పరిశీలించి, గర్భిణులు, బాలింతలు ఉంటే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్నపాటి అనారోగ్యం కలిగినా వెంటనే ప్రథమ చికిత్స చేయాలనే, అవసరమైతే ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు.

బస్టాండ్‌లో భద్రతా ఏర్పాట్ల పరిశీలన