
100 మీటర్ల జాతీయ పతాకంతో విద్యార్థుల మానవహారం
నాగాయలంక: స్వాతంత్య్ర దిన వేడుకలలో హర్‌ఘర్ తిరంగా అభియాన్ నేపథ్యంలో నాగాయలంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ గ్రౌండ్స్‌లో గురువారం విద్యార్థులు ఉత్సాహంగా 100 మీటర్ల జాతీయ పతాకంతో భారీ మానహారం నిర్మించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్రోద్యమ చరిత్ర, స్వాతంత్య్ర దిన ప్రాముఖ్యతలపై పాఠశాల హెచ్‌ఎం అలపర్తి సత్యనారాయణ అవగాహన కలిగించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సేవా కార్యకర్తలు పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): హెచ్‌ఐవీ బాధితులను ఉద్దేశించి అమానవీయంగా మాట్లాడిన జిల్లా లెప్రసీ, టీబీ అధికారి తీరుపై వైద్యశాఖ కమిషనర్ వీరపాండియన్ సీరియస్ అయినట్లు తెలిసింది. హెచ్‌ఐవీ బాధితుల సేవల విషయంలో ఓ వైద్యుడితో ఫోన్లో సంభాషించిన విషయమై సాక్షి జిల్లా ఎడిషన్‌లో ఈ నెల 12న పోతే పొమ్మనండి అంటూ కథనం ప్రచురితమైంది. దీనిపై కమిషనర్ విచారణకు ఆదేశించారు. దీంతో ఆయన ఫోన్‌లో మాట్లాడిన వైద్యుడి నుంచి డీఎంహెచ్‌ఓ వివరణ తీసుకున్నారు. డీఎంఓ, వైద్యశాఖ కార్యాలయంలో వైద్యుల పట్ల ప్రవర్తనా తీరుపై వారి వద్ద నుంచి కూడా వివరణ తీసుకున్నట్లు తెలిసింది. విచారణ నివేదికను డీఎంహెచ్‌ఓ వైద్యశాఖ కమిషనర్‌కు పంపించారని సమాచారం. ఈ విషయమై ఏపీ శాక్స్ అధికారులు సైతం సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. ఇలాంటి అధికారులతో హెచ్‌ఐవీ బాఽధితుల మనోభావాలు దెబ్బతింటాయని భావిస్తున్నట్లు సమాచారం.
టీబీలోనూ అంతే..
నెలన్నర కిందట బాధ్యతలు చేపట్టిన ఆ అధికారి వచ్చిన వెంటనే కొందరు సిబ్బందిని ఇష్టారాజ్యంగా బదిలీలు చేసేసినట్లు తెలిసింది. వాస్తవంగా వారికి పోస్టింగు ఇచ్చిన సమయంలో ఏ సెంటర్‌లో పనిచేయాలో కూడా పేర్కొంటారు. కానీ దానికి విరుద్ధంగా బదిలీలు చేసినట్లు చెబుతున్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు గురు వారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి కంకిపాడుకు చెందిన బి.తుషార పేరిట రాజేష్ దంపతులు రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. ఇక అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణ పథకానికి విజయవాడ కామకోటినగర్‌కు చెందిన సీహెచ్ రమేష్‌కుమార్, మాధురి దంపతులు తమ కుమారులు చుండూరి నాగరామ్, జశ్వంత్ పేరిట రూ.1,00,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.

100 మీటర్ల జాతీయ పతాకంతో విద్యార్థుల మానవహారం