
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కృత్తివెన్ను: రపమాదవశాత్తు బైక్ రోడ్డు మార్జిన్‌లో పడిపోవడంతో వ్యక్తి మరణించిన సంఘటన మండల పరిధిలోని సంగమూడి సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. కృత్తివెన్ను ఎస్‌ఐ పైడిబాబు తెలిపిన వివరాల ప్రకారం చినగట్టు గ్రామానికి చెందిన మాటూరి బసవేశ్వరరావు (పెదబాబు) బుధవారం రాత్రి కృత్తివెన్ను వెళుతుండగా అతను ప్రయాణిస్తున్న మోటార్‌బైక్ అదుపుతప్పి రోడ్డు మార్జిన్‌లోకి దూసుకుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ గమనించలేదు. కొంత సమయం తరువాత వాహనదారుల సమాచారం మేరకు ప్రమాద స్థలాన్ని గుర్తించి చూడగా అప్పటికే పెదబాబు మరణించాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం గురువారం బంధువులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సందర్శించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
విజయవాడలీగల్: విజయవాడ కోర్టులో గురువారం తొలి ఈ–సేవ కేంద్రాన్ని రెండవ అదనపు జిల్లా జడ్జి ఎ.సత్యానంద్ ప్రారంభించారు. రెండవ ఈ–సేవ కేంద్రాన్ని 12వ అదనపు జిల్లా జడ్జి ఎస్.సునీల్, మూడవ ఈ–సేవ కేంద్రాన్ని కమర్షియల్ కోర్టు జడ్జి భూపాల్ రెడ్డి ప్రారంభించారు. ఇకనుంచి ఎటువంటి దావాలు కానీ, దావాకి సంబంధించిన దస్తావేజులు కానీ ఫైల్ చేసుకోవటానికి ఈ కేంద్రాలు ఉపయోగపడతాయి. దీని ద్వారా న్యాయవాదులకు కక్షిదారులకు ఖర్చు తక్కువ, పని సులభం అవుతుంది కక్షిదారులకు కావలసిన కేసుకు సంబంధించిన వివరాలన్నీ ఈ కేంద్రంలో అడిగి తెలుసుకోవచ్చు. కార్యక్రమంలో పోక్సో కోర్టు జడ్జి వేల్పుల భవనమ్మ, ఎంపీ ఎమ్మెల్యే కోర్టు జడ్జి ఎ.అనిత, 13వ అదనపు జిల్లా జడ్జి శేషయ్య, ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు జడ్జి తిరుమల వెంకటేశ్వర్లు, సీనియర్ సివిల్ జడ్జి రమణారెడ్డి, ఏడో అదనపు జిల్లా జడ్జి అబ్రహం, నాలుగవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి టి.అంజనీ ఎస్‌ఎస్ రామ ఆదిత్య రిషిక, మూడవ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పి. తిరుమల రావు, ఇతర జడ్జిలు పాల్గొన్నారు.
హనుమాన్‌జంక్షన్ రూరల్:
బాపులపాడు మండలం మల్లవల్లిలోని ఈదులగూడెం రోడ్డులో ఉన్న మహిషమ్మ తల్లి దేవస్థానంలో బుధవారం అర్థరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. గ్రామ శివారులో మామిడి తోటల మధ్య నిర్మానుష్య ప్రాంతంలో ఆలయం ఉండటంతో రాత్రివేళ దొంగలు సులువుగా దోపిడీ చేశారు. ఆలయ ప్రధాన ద్వారం తాళం ధ్వంసం చేసి గర్భగుడిలోకి ప్రవేశించిన దుండగులు హుండీ అపహరించుకుపోయారు. ఆలయ వెనుక ప్రాంగణంలో హుండీని ధ్వంసం చేసి అందులోని నగదు తీసుకుని పరారయ్యారు. ఆలయ గర్భగుడిలో బీరువాలో భద్రపర్చిన అమ్మవారి నూతన వస్త్రాలు, ఇతర ఆభరణాలను కూడా దుండగులు అపహరించారు. ముఖానికి మాస్క్‌లు ధరించిన ఇద్దరు యువకులు ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి హుండీ అపహరించటం, బీరువా ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. గురువారం ఉదయం ఆలయంలో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు వీరవల్లి పోలీసులకు సవ

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి