భరతముని జయంత్యుత్సవం | - | Sakshi
Sakshi News home page

భరతముని జయంత్యుత్సవం

Dec 24 2023 2:00 AM | Updated on Dec 24 2023 2:00 AM

కల్పన శ్రీనివాస్‌ శిష్య బృందం నృత్యం - Sakshi

కల్పన శ్రీనివాస్‌ శిష్య బృందం నృత్యం

కూచిపూడి(మొవ్వ): అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి ఆధ్వర్యాన నాట్యక్షేత్రం కూచిపూడిలోని శ్రీసిద్ధేంద్ర యోగి కళావేదికపై శనివారం సాయంత్రం జరిగిన భరతముని జయంత్యుత్సవం ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. యూఎస్‌ఏకు చెందిన దేవులపల్లి కుటుంబ సభ్యుల సౌజన్యంతో కళామండలి కార్యదర్శి పసుమర్తి మృత్యుంజయశర్మ ఆధ్వర్యంలో సాగిన ఉత్సవాల్లో కూచిపూడి, చైన్నె, కేరళ, భువనేశ్వర్‌, అమెరికాకు చెందిన కళాకారులు ప్రదర్శించిన నాట్యాంశాలు ఆకట్టుకున్నాయి. సంస్కార భారతి విజయవాడ ప్రధానకార్యదర్శి దుర్భా శ్రీనివాస్‌, కళారత్న, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత వేదాంతం రాధేశ్యాం, ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల నాట్యాచార్యులు పసుమర్తి శ్రీనివాసశర్మ తదితరులు భరతముని, అఖిలభారత కూచిపూడి నాట్య కళామండలి మాజీ కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పసుమర్తి మృత్యుంజయశర్మ, హరినాథశాస్త్రితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. నాట్యాంశాల్లో తొలి అంశంగా చైన్నెకు చెందిన జయంతి కల్పనా శ్రీనివాస్‌ శిష్యులు ప్రజ్ఞ, రోహిత భాస్కరునిలు, అమెరికాకు చెందిన నాట్యాచారిణి వడ్లమాని సుధ శిష్యబృందం సాహితి వేగుంట గణేశ వందనం, కేశవ నారాయణ.. శివాష్టకాలను చక్కని హావభావాలతో లయకు తగినట్టు అడుగులు వేస్తూ అంశాలను రక్తి కట్టించారు. కేరళకు చెందిన కూచిపూడి, భరత నాట్యకళాకారులు దీపక్‌ నాయర్‌ శిష్య బృందం పలు అంశాలనుప్రదర్శించి ప్రేక్షకుల కరతాళధ్వనులందుకున్నారు. భువనేశ్వర్‌కు చెందిన ఒడిసీ యుగళనర్తనం కళాకారులు మోనాలిసాదాస్‌, సాస్మిత బెహరాలు శంకర వర్ణం.., నవ దుర్గ.. అంశాలను కను వింపుగా ప్రదర్శించారు. చివరిగా కూచిపూడికి చెందిన నాట్యాచార్య డాక్టర్‌ చింతా రవిబాలకృష్ణ శిష్య బృందం ప్రదర్శించిన భక్త ప్రహ్లాద కూచిపూడి యక్షగానం ఆహూతులను భక్తి పారవశ్యంలో లోలలాడించాయి. నిర్వాహకులు నృత్య విద్వాన్‌, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత వేదాంతం రామలింగ శాస్త్రి చేతుల మీదగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న అతిథులు 1
1/1

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న అతిథులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement