నేటి బాలలే రేపటి పౌరులు | - | Sakshi
Sakshi News home page

నేటి బాలలే రేపటి పౌరులు

Nov 15 2026 1:32 PM | Updated on Nov 15 2026 1:32 PM

ఆసిఫాబాద్‌రూరల్‌: నేటి బాలలే రేపటి పౌరులు, సమాజానికి అసలైన వీరులని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ శారదాదేవి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో బాలల దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి బాలల హక్కులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సురక్షితమైన వాతావరణంలో పెరిగే హక్కు పిల్లలకు ఉందని, వారి హక్కులకు భంగం కలిగించకూడదని సూచించారు. మండలంలోని బూర్గుడ ఉన్నత పాఠశాలలో లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరీ అనూష, సివిల్‌ జడ్జి లక్ష్మి, డీసీపీవో మహేశ్‌, ప్రిన్సిపాల్‌ మహేశ్వర్‌, సర్పంచ్‌ సంగీత, లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు ఉదయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement