పడిపోతున్న ఉష్ణోగ్రతలు | - | Sakshi
Sakshi News home page

పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Nov 15 2026 1:32 PM | Updated on Nov 15 2026 1:32 PM

తిర్యాణి: మండలంలో రాత్రి ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా, పగలు 30డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. జిల్లాలో సిర్పూర్‌(యు) మండలంలో శనివారం 11.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, గిన్నెదరిలో 12.0, తిర్యాణిలో 13.4, కెరమెరిలో 14.1, కాగజ్‌నగర్‌లో 14.8, సిర్పూర్‌(టి)లో 15.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు చలి త్రీవతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం 6 అయిందంటే ఇంటినుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు.

సెపక్‌తక్రాలో జిల్లా జట్టుకు సిల్వర్‌ మెడల్‌

రెబ్బెన: ఈనెల 12నుంచి 14వరకు జనగామ జిల్లాలో ఎస్జీఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌–14 రాష్ట్ర స్థాయి సెపక్‌తక్రా పోటీల్లో జిల్లా బాలుర జట్టు ద్వితీయ స్థానంలో నిలి చి సిల్వర్‌ మెడల్‌ సాధించినట్లు సెపక్‌తక్రా అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి శిరీష, జిల్లా అధ్యక్షుడు తిరుపతి, ఒలింపిక్‌ అసోసియేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారాయణరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబయ్య, సదానందం, అనిల్‌గౌడ్‌, సతీశ్‌తో కలిసి క్రీడాకారులను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement