ఆసిఫాబాద్‌అర్బన్: విద్యాసంస్థల పరిసరాల్లో మత్తు పదార్థాలకు చెక్ పెట్టేందుకు ఎస్పీ నితిక పంత్ ఆదేశాల మేరకు డీఎస్పీ అశోక్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. 31 కేసులు నమోదు చేశారు. 3.24 లీటర్ల ఐఎంఎఫ్‌ఎల్ మద్యం స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున పొగాకు ఉత్పత్తులు సీజ్ చేశా రు. పాఠశాలలకు 100 మీటర్ల పరిధిలోని కిరాణా దుకాణాలు, పాన్‌షాపులు, ఇతర వ్యాపార కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం, గుట్కా, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్నవారిపై చర్యలు చేపట్టారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే సమీప పోలీస్‌స్టేషన్‌లో లేదా ‘డయల్ 112’కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. తనిఖీల్లో ఆయా పోలీస్ స్టేషన్ల సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.


