ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె విరమణ | - | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె విరమణ

Nov 15 2026 1:32 PM | Updated on Nov 15 2026 1:32 PM

ఆసిఫాబాద్‌అర్బన్‌: డిమాండ్లు నెరవేర్చాలని ఎన్‌హెచ్‌ఎం పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులు చేపట్టిన సమ్మె 32 రోజుల తర్వాత తాత్కాలికంగా విరమించారు. ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ హామీపై న మ్మకంతో, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తాత్కాలిక విరమణ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర వైద్యారోగ్య కమిషనర్‌తో జరిగిన చర్చల్లో సానుకూల స్పందన లభించినట్లు తెలిపారు. ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి త్వరలో సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇవ్వడంతో సమ్మెను తాత్కాలికంగా విరమించినట్లు పే ర్కొన్నారు. ఈ మేరకు సమ్మె విరమించినట్లు డీఎంహెచ్‌వో కార్యాలయంలో లేఖ అందజేసినట్లు తెలి పారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement