దహెగాం: ప్రాథమిక ఆరో గ్యకేంద్రాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటా మని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు హామీ ఇచ్చా రు. ఈనెల 11న ‘సాక్షి’ మెయిన్‌లో ‘వైద్యులు, సిబ్బంది లేక కాన్పు చేసిన ఆయమ్మ’, జిల్లాలోని వైద్య శాఖలో భారీగా డాక్టర్లు, సిబ్బంది పోస్టులు ఖాళీ ఉండడంపై 12న ‘ఇన్‌చార్జి వైద్యం’ శీర్షికలతో ప్రచురించిన కథనాలకు ఎమ్మెల్యే స్పందించా రు. శనివారం మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో నెలకొన్న సమస్యలు సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయడానికి కంక ణం కట్టుకున్నామని తెలిపారు. అదనపు నియామకాలు చేపట్టి ఖాళీలు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. సిబ్బంది విధులకు సక్రమంగా హాజరై గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆయన వెంట సర్పంచ్ జయలక్ష్మి, వైద్యాధికారి సందీప్, సింగిల్ విండో చైర్మన్ తిరుపతిగౌడ్, పీహెచ్‌సీ సిబ్బంది ఉన్నారు.


