సీఎం అసమర్థతతో రైతులకు కష్టాలు | - | Sakshi
Sakshi News home page

సీఎం అసమర్థతతో రైతులకు కష్టాలు

Sep 25 2026 1:59 AM | Updated on Sep 25 2026 1:59 AM

కాంగ్రెస్‌ రాకతో ప్రజలు, వ్యాపారులకు కరెంట్‌ షాక్‌ పంటలకు పెట్టుబడి లేదు.. ఎరువులు రావు.. బీఆర్‌ఎస్‌ నాయకులు బాల్క సుమన్‌, జోగు రామన్న, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్‌ జాదవ్‌ జైపూర్‌ ఎస్టీపీపీ సందర్శన

జైపూర్‌: సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థతతో రాష్ట్రంలో రైతులు, ప్రజలు, పరిశ్రమలకు కరెంటు కష్టాలు దాపురించాయని, కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు ఉన్న కరెంటు కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే మాయమైందని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్‌ బాల్క సుమన్‌, మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్‌ జాదవ్‌ విమర్శించా రు. బీఆర్‌ఎస్‌ పార్టీ పిలుపు మేరకు కరెంటు సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా గురువా రం ఆ పార్టీ నాయకుల బృందం జైపూర్‌లోని సింగరేణి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌(ఎస్టీపీపీ)లో పర్యటించింది. పార్టీ శ్రేణులు భారీగా ప్లాంటు ప్రధాన గేటు వద్దకు చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. ఎస్టీపీపీ అధికారుల సూచనల మేరకు బాల్క సుమన్‌, జోగు రామన్న, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్‌జాదవ్‌, మా జీ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, కోనేరు కోనప్ప, నాయకులు జాన్సన్‌ నాయక్‌, కౌశికహరిలను ప్లాంటులోకి అనుమతించారు. బస్సులో అడ్మిన్‌ భవన్‌లో విద్యుత్‌ ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై ఎస్టీపీపీ ఈడీ చిరంజీవితో మాట్లాడారు. యూనిట్‌–1లో 330 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుండగా యూనిట్‌–2 షట్‌డౌన్‌లో ఉన్నట్లు తెలిపారు. బొగ్గు నిల్వలు, విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాల పరిశీలనకు అనుమతించాలని నాయకులు కోరగా.. అధికారులు నిరాకరించారు. అనంతరం ఎస్టీపీపీ ప్రధాన గేటు వద్ద బీఆర్‌ఎస్‌ నాయకులు విలేకరులతో మా ట్లాడారు. రైతాంగానికి కనీసం రోజుకు మూడు గంటలు కరెంటు ఇవ్వడం లేదని విమర్శించారు. సింగరేణి సంస్థకు జెన్‌కో రూ.53వేల కోట్లు బకాయిలు చెల్లించా ల్సి ఉండగా బొగ్గు రవాణా నిలిపి వేయడంతో ఉత్పత్తి తగ్గి కరెంటు కొరత నెలకొందని తెలిపారు. రైతులకు పంట పెట్టుబడి సాయం, సమయానికి ఎరువులు, విత్తనాలు అందించకుండా ప్రభుత్వం రైతులు ఉసురుపోసుకుంటోందని విమర్శించారు. ఎస్టీపీపీలో 1200మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉండగా 330మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు. సింగరేణి స్వంత ప్లాంటుకు సైతం బొగ్గు రవాణా జరగడం లేదని ఆరోపించా రు. మాజీ విప్‌ బాల్క సుమన్‌ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి వివేక్‌వెంకటస్వామిపై తీవ్ర స్థాయిలో ధ్వ జమెత్తారు. ఒక్క మూడు గంటలు కరెంట్‌ లేకుండా ఉంటారా అని ప్రశ్నించారు. చెన్నూర్‌ నియోజకవర్గం, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఏ గ్రామానికై నా పోలీసులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు లేకుండా వెళ్లే దమ్ముందా అని ప్రశ్నించారు. ఏ గ్రామంలోనైనా 24 గంటల కరెంట్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇస్తుందని ఏ ఒక్క రైతు చెప్పినా తాను ఈ ప్రాంతంలోనే ఉండనని, రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన సవాల్‌ విసిరారు.

పోలీసుల భారీ బందోబస్తు

జైపూర్‌లో ఓ వైపు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అభివృద్ధి కార్యక్రమాల పర్యటన ఉండగా.. మరోవైపు బీఆర్‌ఎ స్‌ నాయకుల బృందం పర్యటనతో ఉద్రిక్త వా తావరణం ఏర్పడింది. మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌, సీఐలు నవీన్‌కుమార్‌, రమేశ్‌, ఎస్సైలు భూమేశ్‌, రాజేందర్‌, ఆంజనేయులు, సీఐఎస్‌ఎఫ్‌ పోలీ సులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement