జీపీల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి | - | Sakshi
Sakshi News home page

జీపీల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి

Sep 25 2026 1:59 AM | Updated on Sep 25 2026 1:59 AM

● కలెక్టర్‌ కె.హరిత

ఆసిఫాబాద్‌: వీబీ జీ రామ్‌ జీ పథకం కింద పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ కె.హరిత ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌తో కలిసి ఎంపీడీవోలు, ఎంపీవోలు, గ్రామీణాభివృద్ధి సంస్థ ఏపీఎంలు, సాంకేతిక సహాయకులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు అవగాహన కల్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధికి గ్రామ సభల ద్వారా తీర్మానం చేయాలన్నారు. వీబీ జీ రామ్‌జీ పథకం కింద 370 రకాల పనులు చేపట్టవచ్చని, అంగన్‌వాడీ, పంచాయతీ భవనాలు, అదనపు గదులు, వీవో భవనాలు, పాఠశాలల్లో మూత్రశాలలు, ప్రహరీలు, మురుగుకాల్వలు నిర్మించాలన్నారు. జలసిరి పథకం ద్వారా నీటి, ఊట, పంట కుంటల పనులు చేపట్టవచ్చని తెలిపారు. ఇప్పటికే మంజూరైన పనులను పూర్తి చేయడంపై సర్పంచులు దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో దత్తారావు, డీపీవో భిక్షపతి పాల్గొన్నారు.

ప్రశాంతంగా నిమజ్జనం నిర్వహించాలి

ఆసిఫాబాద్‌: జిల్లాలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని పెద్దవాగు వద్ద ఏర్పాట్లను గురువారం ఆర్డీవో లోకేశ్వర్‌ రావు, తహసీల్దార్‌ రియాజ్‌ అలీ, మున్సిపల్‌ కమిషనర్‌ అంజయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ మెంగ్రె ఆకాశ్‌తో కలిసి పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ విగ్రహాలను తరలించే రహదారి బురదమయంగా మారిందని వెంటనే గుంతలు పూడ్చాలన్నారు. నిమజ్జనం ప్రాంతం వద్ద జనరేటర్‌, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.

1 వరకు వయోవృద్ధుల వారోత్సవాలు

ఆసిఫాబాద్‌: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం– 2026లో భాగంగా ఈ నెల 24 నుంచి అక్టోబర్‌ 1 వరకు వయోవృద్ధుల సంక్షేమ, సాధికారత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ కె.హరిత తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం వారోత్సవాల పోస్టర్‌ ఆవిష్కరించారు. వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జండర్‌ల సాధికారత శాఖ ఆధ్వర్యంలో సుదీర్ఘ జీవితాల కోసం వ్యవస్థలను పునరాలోచించడం అనే నినాదంతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 25న వయోవృద్ధుల ఆరోగ్యం, శ్రేయస్సు దినోత్సవం, 26న వృద్ధాశ్రమాల కోసం సామర్థ్య నిర్మాణ కార్యక్రమం, 28న సైబర్‌ భద్రత, డిజిటల్‌ అక్షరాస్యత, వృద్ధులపై జరిగే దుర్వినియోగం నుంచి రక్షణపై అవగాహన కార్యక్రమాలు, 29న తరాల మధ్య అనుబంధం, అభ్యాస దినోత్సవం, 30న చురుకై న వృద్ధాప్యం, ఆరోగ్య శ్రేయస్సు, తరాల మధ్య నడక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. అక్టోబర్‌ 1న వయోవృద్ధుల దినోత్సవం నిర్వహిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement