గ్రంథాలయ భవనం నిర్మిస్తాం | - | Sakshi
Sakshi News home page

గ్రంథాలయ భవనం నిర్మిస్తాం

Sep 25 2026 1:59 AM | Updated on Sep 25 2026 1:59 AM

● జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అనిల్‌కుమార్‌

కౌటాల: కౌటాల గ్రంథాలయానికి నూతన భవనం నిర్మిస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కె.అనిల్‌కుమార్‌ హామీ ఇచ్చారు. ఈ నెల 21న ‘సాక్షి’ గ్రంథాలయాల తీరుపై ‘సమస్యల గ్రంథం’ అనే కథనం ప్రచురితం కాగా, గురువారం ఆయన మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ గది నుంచి లైబ్రరీని వేరే భవనంలో మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరిందని, కొత్త భవనం మంజూరు చేస్తామని తెలిపారు. జిల్లాలోని గ్రంథాలయాల్లో పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉంచడంతోపాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కన్నెపల్లి గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని సర్పంచ్‌ మోర్లె పార్వతి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కోట ప్రసాద్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సిద్ధల దేవయ్య, సహకార సంఘం చైర్మన్‌ కుమురం మాంతయ్య, సర్పంచ్‌ నక్క శంకర్‌, కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం జానకీరావు, నాయకులు గట్టయ్య, అనిల్‌, రాంకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎఫెక్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement