మెరుగైన వైద్య సేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్య సేవలు అందించాలి

Sep 24 2026 12:00 AM | Updated on Sep 24 2026 12:00 AM

● కలెక్టర్‌ కె.హరిత

తిర్యాణి: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. తిర్యాణి మండలం గిన్నెధరిలోని పీహెచ్‌సీని బుధవారం తనిఖీ చేశారు. హాజరు పట్టిక, మందుల నిల్వ గది, రికార్డులు పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జ్వర పీడితులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. అనంతరం విజయనగర్‌ గ్రామంలోని జంగుబాయి మండల సమాఖ్య కార్యాలయాన్ని సందర్శించారు. పాఠశాల విద్యార్థులకు కుడుతున్న ఏకరూప దుస్తులను పరిశీలించారు. రెండో జత దుస్తులను త్వరగా సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే రోంపల్లిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కొనసాగుతున్న హియరింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. అనామలిస్‌ జాబితాలోని ఓటర్లకు జారీ చేసిన నోటీసులకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన వేగవంతం చేయాలన్నారు. త్వరగా హియరింగ్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో నగేష్‌, వైద్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement